పెగాసస్ గూఢచర్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో (సిట్) కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇతరులపై ఈ స్పైవేర్ సాయంతో ప్రభుత్వ సంస్థలు నిఘా పెట్టాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
పెగాసస్ కుంభకోణం తీవ్ర ఆందోళనకరమని శర్మ అన్నారు. అది భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, దేశ భద్రతపై జరిగిన ముప్పేట దాడేనని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. విస్తృత, బాధ్యతారాహిత్యమైన నిఘా అనైతికమని చెప్పారు.
'చట్ట విరుద్ధంగా ప్రకటించాలి'
పెగాసస్ రూపకర్త ఎన్ఎస్ఓ గ్రూపునకు చెందిన 50వేలకు పైగా క్లయింట్ల ఫోన్ నెంబర్లు లక్ష్యంగా చేసుకున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పెగాసస్ కేవలం నిఘా సాధనం కాదని, భారత రాజ్యాంగంపై ఎక్కుపెట్టిన సైబర్ ఆయుధమని ఆరోపించారు. ఈ సాఫ్ట్వేర్ను నిఘా కోసం కొనుగోలు చేయడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు.
ఇవీ చూడండి: