ETV Bharat / bharat

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి - గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి

గణేశ్​ నిమజ్జనం వేడుకల్లో అపశ్రుతి జరిగింది. గణేశ్ నిమజ్జనం చేస్తుండగా కాలువలో పడి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన హరియాణాలోని మహేంద్రగఢ్​ జిల్లాలో జరిగింది. యూపీలో జరిగిన మరో ఘటనలోను నిమజ్జనం చేస్తూ నదిలో పడి ముగ్గురు మరణించారు.

haryana latest news
haryana latest news
author img

By

Published : Sep 9, 2022, 10:18 PM IST

హరియాణా మహేంద్రగఢ్​లో గణేశ్​ నిమజ్జనం వేడుకల్లో అపశ్రుతి జరిగింది. గణేశ్ నిమజ్జనం చేస్తుండగా కాలువలో పడి నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా కొందరు గల్లంతయ్యారని.. వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రస్తుతానికి గల్లంతైన వారి సంఖ్యపై స్పష్టత లేదని పోలీసులు చెప్పారు.

గంగా నదిలో పడి ముగ్గురు : ఉత్తర్​ప్రదేశ్​లో గణేష్​ నిమజ్జనంలో ప్రమాదం జరిగింది. నిమజ్జనానికి గంగా నదిలోకి దిగిన ఐదుగురు యువకులు కొట్టుకుపోయారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన ఉన్నావ్​ జిల్లా సఫిపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరియార్ గ్రామంలో జరిగింది. "ఇద్దరు మైనర్లతో సహా ఐదుగురు నదిలో గల్లంతయ్యారు. అలల ఉద్ధృతి కారణంగా ఇలా జరిగింది. స్థానికులు రక్షించగా.. అందులో లవ్​కేశ్​ సింగ్(18), ప్రశాంత్ సింగ్(16) అక్కడికక్కడే మృతి చెందగా.. విషాల్​(15) ఆస్పత్రిలో చనిపోయాడు. మిగతా ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది" అని సబ్​ డివిజనల్​ మెజిస్ట్రేట్​ అంకిత్​ శుక్లా తెలిపారు. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి: 500 కిలోల నగలు ఉన్నా తెల్ల రేషన్ కార్డ్.. కౌన్సిలర్​కు కోర్టు షాక్

'రూ.41వేల టీషర్ట్​ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్​పై భాజపా సెటైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.