ETV Bharat / bharat

''లోక్​సభ ఘటన' వెనుక పెద్ద వ్యక్తులు, వారంతా తప్పించుకున్నారు!- తప్పు చేస్తే ఉరితీయండి!!' - పార్లమెంట్ భద్రతా వైఫల్యం

Parliament Security Breach Accused Family Members : పార్లమెంట్‌లో లోక్‌సభలోకి ప్రవేశించి అలజడి సృష్టించిన ఘటనపై నిందితుల కుటుంబాలు స్పందించాయి. తమవారు చేసిన చర్యను వారు ఖండించారు. తమ పిల్లలు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కుట్ర వెనుక పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు దాగి ఉన్నారేమోనని నిందితుల కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

Parliament Security Breach Accused Family Members

author img

By PTI

Published : Dec 14, 2023, 5:10 PM IST

Parliament Security Breach Accused Family Members : ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటులోని లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను అధికార పార్టీతో సహా ప్రతిపక్షాలు ఖండించాయి. మరోవైపు నిందితుల కుటుంబాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. తమ వారు చేసిన పనికి తాము సిగ్గుపడుతున్నట్లు వెల్లడించాయి. నిజంగా తప్పు చేసి ఉంటే తమవారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన సాగర్‌ శర్మ మేనమామ ఈ కుట్ర వెనుక పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏమి జరిగిందో తమకు తెలియదని దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని అన్నారు.

"సాగర్‌ను ఈ కుట్రలోకి లాగారు. ఈ కుట్రలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వ్యక్తుల హస్తం ఉండి ఉంటుంది. ఆ పెద్ద వ్యక్తులే సాగర్‌ను ఈ కుట్రలో ఇరికించి ఉంటారు. చిన్న చిన్న వ్యక్తులే ఇరుక్కుంటారు. పెద్ద వ్యక్తులు తప్పించుకుంటారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరపాలి. నా సోదరికి సాగర్‌ ఒక్కడే కుమారుడు. సాగర్‌ బయట తిరిగే వ్యక్తికాడు. ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లోనే ఇతర నిందితులతో పరిచయం ఏర్పడి ఉంటుంది. సాగర్‌ వంటి చిన్న వ్యక్తుల వద్ద రాష్ట్రాలు దాటి తిరగడానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి."
-ప్రదీప్‌ శర్మ, నిందితుడు సాగర్‌ మేనమామ

'నా కుమారుడు చాలా మంచివాడు'
తమ కుమారుడి చర్యను మరో నిందితుడైన మనోరంజన్‌ తండ్రి దేవరాజే గౌడ్‌ ఖండించారు. తన కుమారుడు మనోజ్‌ చాలా మంచివాడని ఎల్లప్పుడూ సమాజానికి మంచి చేయాలని కోరుకునేవాడని తెలిపారు. తన కుమారుడు నిజంగా తప్పు చేసి ఉంటే అతడిని ఉరి తీయాలని కోరారు.

"నా కొడుకు మంచి అబ్బాయి. అతనికి మంచి విద్య, జ్ఞానాన్ని అందించాము. అతను ఎందుకు చేశాడో మాకు తెలియదు. నా కుమారుడైనా బయటవాళ్లు అయినా ఎవరైనా సరే చేసింది తప్పు. దీన్ని నేను ఖండిస్తున్నాను."
-దేవరాజే గౌడ్, మనోరంజన్‌ తండ్రి

'మనోరంజన్​కు ఎలాంటి నేర నేపథ్యం లేదు'
మరోవైపు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో నిందితుడైన మనోరంజన్‌కు ఎలాంటి నేర నేపథ్యం లేదని పోలీసు వర్గాలు తెలిపాయి. 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్'తో అతడికి సంబంధం ఉన్నట్లు తేలిందని వెల్లడించాయి. మనోరంజన్​కు విప్లవ భావాలు ఉన్నాయని పేర్కొన్నాయి.

'నిరుద్యోగ సమస్యలు లేవనెత్తేందుకే'
తన సోదరికి ఏ సంస్థతోనూ సంబంధాలు లేవని పార్లమెంటు వెలుపల ఆందోళనలు చేసిన నిందితుల్లో ఒకరైన నీలమ్‌ సోదరుడు రామ్‌ నివాస్‌ తెలిపారు. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను లేవనెత్తడానికే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉంటుందన్నారు. నీలమ్‌ దిల్లీలో ఉందని తమకు తెలియదన్నారు. తమ గ్రామంలో రైతుల సమస్యలపై పోరాడేదని వెల్లడించారు.

"నిరుద్యోగం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె(నీలమ్‌) ఈ చర్యకు పాల్పడి ఉంటుంది. ఆమె(నీలమ్‌) ఇతర గ్రామస్థులతో కలిసి రైతు నిరసనల్లో పాల్గొనేది. ఆమె దిల్లీలో ఉందని మాకు చెప్పలేదు. ఆమె చదువు కోసం హిసార్‌లో ఉందని మేము అనుకున్నాం."
-రామ్‌ నివాస్‌, నీలమ్ సోదరుడు

ఆర్మీలో చేరడం ఆసక్తి
ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనడానికి దిల్లీ వెళుతున్నానని చెప్పాడని మరో నిందితుడు అమోల్‌ శిందే తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమారుడు ఆర్మీలో చేరాలని ఎప్పుడూ ఆసక్తి కనబరిచేవాడని చెప్పారు. కోచింగ్ కోసం నెలకు రూ.4వేలు తమను అడిగాడని తమ దగ్గర లేకపోవడం ఇవ్వలేకపోయామని పేర్కొన్నారు.

"అమోల్ అసోం సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆర్మీ రిక్రూట్​మెంట్ ర్యాలీల్లో పాల్గొన్నాడు. అయినా ఉద్యోగం రాకపోవడం వల్ల నిరుద్యోగిగా ఉన్నాడు. రోజువారీ కూలీ పనులకు వెళ్లేవాడు. అమోల్ కేసులో నిర్ధోషిగా బయటపడి గ్రామానికి వస్తాడని ఆశిస్తున్నాం. లేదంటే మాకు కొడుకు లేడని అనుకుంటాం."
-ధన్​రాజ్ శిందే, అమోల్ శిందే తండ్రి

'లోక్​సభ ఘటన'పై అట్టుడికిన పార్లమెంట్- 15 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్

పార్లమెంట్​లో భద్రతా వైఫల్యంపై విచారణ కమిటీ - CRPF డీజీ నేతృత్వంలో దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.