ETV Bharat / bharat

ఆగని ఆందోళనలు- ఉభయ సభలు రేపటికి వాయిదా - రాజ్యసభ వాయిదా

parliament live
పార్లమెంట్ లైవ్ అప్​డేట్స్
author img

By

Published : Jul 26, 2021, 11:15 AM IST

Updated : Jul 26, 2021, 5:14 PM IST

17:12 July 26

5గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.

16:26 July 26

విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సాయంత్రం 5గంటలకు వాయిదా పండింది.

15:25 July 26

విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో లోక్​సభ రేపటికి వాయిదా పడింది. వాయిదాకు మందుకు సభలో ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు-2021,  నేషనల్ ఇన్​స్టిట్యుట్​ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్ మేనేజ్‌మెంట్ బిల్లు-2021 ఆమోదం పొందాయి.

15:07 July 26

విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడింది.

14:56 July 26

మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమైన లోక్​ సభ విపక్షాల ఆందోళనతో 3 గంటలకు వాయిదా పడింది. 

14:06 July 26

పార్లమెంటు ఉభయసభల్లో పెగాసస్ దుమారం కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు లోక్​సభ, రాజ్యసభ తిరిగి సమావేశమైనా.. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఫలితంగా లోక్​సభ 2.45 వరకు, రాజ్యసభ 3 గంటల వరకు వాయిదా పడ్డాయి.

12:24 July 26

రాజ్యసభ రెండోసారి వాయిదా పడింది. విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సాధారణ కార్యకలాపాలు జరిగే అవకాశం లేనందున సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తెలిపారు. 

11:26 July 26

పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్​పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబడటం వల్ల ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సమావేశం ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.

మరోవైపు, విపక్షాల ఆందోళనల మధ్య లోక్​సభ సైతం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.

యుద్ధవీరులకు నివాళి

వాయిదాకు ముందు ఉభయ సభలు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు తెలిపాయి. దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా ఎంపీలందరూ కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు.

మీరాబాయికి అభినందనలు

అదేసమయంలో ఒలింపిక్స్​లో రజత పతకం సాధించిన వెయిట్​లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్​లిఫ్టింగ్​లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.

11:13 July 26

ఆగని విపక్షాల ఆందోళనలు- ఉభయ సభలు వాయిదా

రాజ్యసభ వాయిదా

పార్లమెంట్​లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్ వ్యవహారంపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబడటం వల్ల.. రాజ్యసభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.

Last Updated : Jul 26, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.