ETV Bharat / bharat

కొడితే 'వజ్రాల బుట్ట'లో పడడమంటే ఇదేనేమో!.. రాత్రికి రాత్రే లక్షాధికారులుగా.. - మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో రైతుకు దొరికిన వజ్రం

వజ్రాల మైనింగ్ కోసం ప్రయత్నించి సఫలమయ్యారు మధ్యప్రదేశ్​కు చెందిన కొందరు వ్యక్తులు. నెలరోజుల క్రితం వీరు మైన్ లీజుకు తీసుకోగా.. తాజాగా 3.21 క్యారెట్ల వజ్రం బయటపడింది. దీని విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

panna diamond farmer found diamond
panna diamond farmer found diamond of in field in panna farmer deposited diamond in office
author img

By

Published : Sep 22, 2022, 9:22 PM IST

మధ్యప్రదేశ్​లోని పన్నా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా మారిపోయారు. లీజుకు తీసుకున్న గనిలో వారికి విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది.

panna diamond farmer found diamond of in field in panna farmer deposited diamond in office
వజ్రం
జిల్లాలోని బ్రిజ్​పుర్​కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు తన ఆరుగురు సహచరులతో కలిసి లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న డౌమండ్​ మైన్​ను లీజుకు తీసుకున్నాడు. ఒక నెలపాటు నిరంతరాయంగా శ్రమించినా వజ్రం దొరకలేదు. తాజాగా గురువారం వారికి 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీన్ని డైమండ్​ ఆఫీస్​కు తీసుకెళ్లి అధికారులకు చూపించారు. దీని విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అంత విలువైన వజ్రం దొరకడం వల్ల వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును.. సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని వారు వెల్లడించారు.

రూ.20 లక్షల వజ్రం..
కొద్దిరోజుల క్రితం.. పురుషోత్తంపుర్‌కు చెందిన గోందా బాయీ అనే గిరిజన మహిళ కట్టెల కోసం పన్నా అడవులకు వెళ్లగా.. ఆమెకు వజ్రం దొరికింది. భర్తతో కలిసి డైమండ్ కార్యాలయానికి వెళ్లగా.. ఆ వజ్రం 4.39 క్యారెట్లు అని అధికారులు తెలిపారు. ఆ వజ్రం ఖరీదు సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ప్రభుత్వ పన్నులు, రాయల్టీ మినహాయించిన తర్వాత మిగతా డబ్బుల్ని మహిళకు అందజేశారు.

బుందేల్​ఖండ్​ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాల వెలికితీతకు ప్రభుత్వమే భూముల్ని లీజుకు ఇస్తూ ఉంటుంది. అలా దొరికిన వజ్రాల్ని పన్నాలోని డైమండ్​ ఆఫీస్​లో జమ చేస్తే.. అధికారులు వాటి నాణ్యతను నిర్ధరించి, వేలం వేస్తారు.

ఇవీ చదవండి : మద్యం కోసం దారుణం.. కన్నతల్లిపై కిరోసిన్​ పోసి నిప్పు.. చికిత్స పొందుతూ..

భారీ వర్షాలు.. వరద నీటిలో కొట్టుకుపోయిన రెండు ఆవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.