Palamuru Rangareddy Lift Irrigation Project : పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి లభించింది. పథకం నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ అనుమతుల కమిటీ గత నెల 24వ తేదీన నిర్వహించిన 49వ సమావేశం మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది. పాలమూరు ఎత్తిపోతల పనుల్లో పర్యావరణపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని.. దానికి సంబంధించి ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీని ఈఏసీ ఆదేశించింది. ఆయా చర్యలను నిర్దేశిస్తూ.. ఆమోదం తెలిపింది.
Environmental Clearances For Palamuru Rangareddy Project : ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2016లో ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున అరవై రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకు ఈ పనులను ప్రారంభించింది. ఇందులో 4 లిఫ్టులు, అయిదు జలాశయాలు ఉన్నాయి. నార్లాపూర్ జలాశయం 89.44 శాతం, ఏదుల 90, వట్టెం 70, కరివెన 60, ఉదండాపూర్ జలాశయం 48 శాతం పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో పనులు పూర్తయినట్లు 22నెలలకు ముందు ఈఏసీ నిర్వహించిన అధ్యయన నివేదిక పేర్కొంటోంది.
CM KCR on Palamuru Rangareddy Project : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం సంతోషకరమని సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణమ్మ నీటితో పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైందని తెలిపారు. ఎన్నో కేసులు, అడ్డంకులను ఎదుర్కొని, అకుంఠిత దీక్షతో ఈ అనుమతులను సాధించామని... ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులపై అభినందనల జల్లు కురిపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ పథకం తొలిదశ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని... ఇక రెండోదశ పనులూ వేగంగా కొనసాగుతాయని వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Rangareddy Project)కు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వమైన ఆనందాన్నిస్తోందని.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు(Harishrao) పేర్కొన్నారు. ‘ కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుందని... ఇది మాటల్లో వర్ణించలేని మధురఘట్టమంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణమవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేయగా... కేంద్రం అనేక కొర్రీలు పెట్టిందన్నారు. దశాబ్దాలుగా వివక్షకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి సస్యశ్యామలం చేస్తామని మంత్రి అన్నారు.
పిటిషనర్ వాదనలు వినాలి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం వ్యాఖ్య
"కుట్రలను ఛేదించి.. కేసులను అధిగమించి.. దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించిన మరో అపూర్వ, చారిత్రాత్మక విజయం. ఆయన మొక్కవోని దీక్షకు.. ప్రభుత్వం పట్టువిడవని ప్రయత్నం తోడై సాధించిన ఫలితమిది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారమైన సందర్భం. మాటల్లో వర్ణించలేని మధుర ఘట్టం. పాలమూరు బీళ్ల దాహార్తిని తీర్చే ప్రజల తలరాతను మార్చే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వ ఆనందాన్ని ఇస్తున్నది." - హరీశ్‌రావు మంత్రి, ఎక్స్(Twitter)
KTR Open Letter : పాలమూరు-రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు ఇవ్వండి.. కేటీఆర్ బహిరంగ లేఖ
శ్రీశైలం ప్రాజెక్టు వెనక నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు రూ.32,500 కోట్లలతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభుత్వం ఆ తర్వాత రూ.52వేల కోట్లలకు సవరించింది. ప్రాజెక్ట్‌లో 52శాతం పనుల్ని ఇప్పటికే పూర్తి చేశారు. అయితే పాలమూరు రంగారెడ్డి(Palamuru Rangareddy Lift Irrigation Project)కు అనుమతులు, పర్యావరణ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన ఎన్జీటీ పనులు ఆపి వేయాలని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అనుమతులు రావడంతో.. ప్రాజెక్ట్ నిర్మాణం తిరిగి ప్రారంభం కానుంది.
CM KCR fires on Congress : 'పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంది కాంగ్రెస్ నేతలే'