ETV Bharat / bharat

పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాపై నిషేధం.. రేడియో హ్యాండిల్​పైనా..

పాకిస్థాన్​కు చెందిన ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా భారత్​లో నిషేధానికి గురైంది. పాకిస్థాన్ రేడియో హ్యాండిల్​ను సైతం ట్విట్టర్ నిలిపివేసింది. లీగల్ డిమాండ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్​లో సందేశం వస్తోంది.

pakistan twitter accounts blocked
pakistan twitter accounts blocked
author img

By

Published : Mar 30, 2023, 9:57 AM IST

పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ట్విట్టర్ హ్యాండిల్​పై భారత్​లో నిషేధం పడింది. @GovtofPakistan ఐడీతో ఉన్న వెరిఫైడ్ హ్యాండిల్​ను ట్విట్టర్ భారత్​లో నిలిపివేసింది. పాక్ ఐడీని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. లీగల్ డిమాండ్​లకు అనుగుణంగా భారత్​లో ఈ ఖాతాను నిలిపివేసినట్లు సందేశం కనిపిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఐడీతో పాటు రేడియో పాకిస్థాన్ ట్విట్టర్ సైతం నిషేధానికి గురైంది. @RadioPakistan పేరుతో ఉన్న ఈ ఐడీని ఓపెన్ చేసినా.. అదే సందేశం కనిపిస్తోంది.

బుధవారం బీబీసీ పంజాబీ హ్యాండిల్​ను ట్విట్టర్ బ్లాక్ చేసింది. లీగల్ డిమాండ్ల కారణంగా భారత్​లో ఆ ఖాతాను నిలిపివేసినట్లు తెలిపింది. అయితే, ఖాతా నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరి నుంచి అభ్యర్థన వచ్చిందనే విషయాన్ని ట్విట్టర్ వెల్లడించలేదు. ఖలిస్థానీ అనుకూల నేత అమృత్​పాల్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం జరగడం చర్చనీయాంశమైంది. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ట్వీట్లు చేశారు. 'భగవంత్ మాన్, నరేంద్ర మోదీ.. బీబీసీ నోరు మూయిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని చెబుతున్నవారే ఇలా చేస్తున్నారు' అని పంజాబ్ కాంగ్రెస్ యూత్ వింగ్ లీడర్ బ్రిందర్ సింగ్ ధిల్లాన్ ధ్వజమెత్తారు. 'ఈ నిషేధానికి మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లభిస్తే.. మనం ఏ పార్టీ వ్యవస్థగా మారిపోయినట్టే' అని రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా ట్వీట్ చేశారు. అయితే, బుధవారం సాయంత్రానికే బీబీసీ పంజాబీ ఖాతాను పునరుద్ధరించింది ట్విట్టర్.

ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వ ఖాతా నిలిచిపోవడం గమనార్హం. అయితే, పాక్ ట్విట్టర్ ఖాతా నిషేధానికి గురి కావడం ఇదే తొలిసారి కాదు. 2022 అక్టోబర్​లో ఆ ఖాతాను భారత్​లో నిలిపివేశారు. అంతకుముందు పలుమార్లు సైతం ఖాతాపై తాత్కాలిక నిషేధం వేశారు. ట్విట్టర్ మార్గదర్శకాల ప్రకారం కోర్టు ఆదేశాలు, ఇతర లీగల్ డిమాండ్లకు అనుగుణంగా ఈ ఖాతాలను నిలిపివేస్తారు. ఇలా చేస్తే ఆ దేశంలో సంబంధిత ట్విట్టర్ ఖాతా కనిపించదు. ఇతర దేశాల్లో ఆ ఖాతాపై ఎలాంటి ప్రభావం ఉండదు. గతేడాది జూన్​లో పాకిస్థాన్ ఎంబసీల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. లీగల్ డిమాండ్లకు అనుగుణంగా.. ఐరాస, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్​లలో పనిచేసే పాక్ ఎంబసీల ఖాతాలను నిలిపివేసింది.

2022 ఆగస్టులో భారత సమాచార ప్రసార శాఖ.. పాక్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. పాక్ నుంచి పనిచేస్తున్న 8 యూట్యూబ్ ఛానళ్లు, ఓ ఫేస్​బుక్ అకౌంట్​ను నిషేధిస్తూ ప్రకటన జారీ చేసింది. భారత వ్యతిరేక, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వీటిపై కొరడా ఝుళిపించింది. ఆయా ఛానళ్లు.. నిజమైన టీవీ యాంకర్లు, లోగోలను థంబ్నెయిల్స్​గా పెట్టి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. 2021లో తీసుకొచ్చిన ఐటీ నిబంధనల్లోని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి వాటిపై నిషేధం విధిస్తున్నట్లు అప్పట్లో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.