భారత-పాకిస్థాన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ బీఎస్ఎఫ్ జవాన్.. అనుకోకుండా దాయాది దేశంలోకి ప్రవేశించాడు. వెంటనే అతడిని ఆ దేశ రేంజర్లు బంధించారు. సుమారు 30 గంటల తర్వాత తిరిగి అతడిని అప్పగించారు.
అధికారుల వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఓ బీఎస్ఎఫ్ జవాన్.. అనుకోకుండా పాకిస్థాన్ అబోహర్ సెక్టార్లోకి ప్రవేశించాడు. అనంతరం అతడిని పాక్ జవాన్లు సుమారు 30 గంటలకుపైగా నిర్బంధించారు. గురువారం సాయంత్రం 17.10 గంటలకు ఫ్లాగ్ మీటింగ్ జరిగిన సమయంలో తిరిగి అతడిని సురక్షితంగా అప్పజెప్పారు.
కొద్దిరోజుల క్రితం అబోహర్ సెక్టార్లోని ఇలాంటి ఘటనే జరిగింది. డిసెంబర్ 1న జీరో లైన్ చెకింగ్ చేస్తుండగా ఓ జవాన్ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లాడు. ఫ్లాగ్ మీటింగ్ తర్వాత అదే రోజు పాకిస్థాన్ రేంజర్లు అతడ్ని తిరిగి అప్పగించారు.