ETV Bharat / bharat

గురుద్వారాలో 'మోడల్' ఫోటోషూట్​.. పాక్​కు భారత్​ సమన్లు

Pak model at kartarpur: కర్తార్​పుర్ గురుద్వారాలో పాక్​ మోడల్ వ్యవహరించిన తీరుపై భారత్​ ఆక్షేపించింది. తలపై వస్త్రం కప్పుకోకుండా ఆమె ఫోటోలు దిగడం.. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సిక్కుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు దిల్లీలోని పాక్ హైకమిషన్​కు సమన్లు జారీ చేసింది.

pak model at kartarpur
కర్తార్​పుర్​లో పాక్ మోడల్
author img

By

Published : Dec 1, 2021, 8:45 AM IST

Pak model at kartarpur: కర్తార్‌పుర్‌లోని గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌లో మోడల్‌ సులేహా ఇంతియాజ్‌ తలపై వస్త్రం కప్పుకోకుండా ఫొటోషూట్‌లో పాల్గొనడాన్ని భారత్‌ ఆక్షేపించింది. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి ఈ వ్యవహారంలో మంగళవారం సమన్లు జారీ చేసింది. సులేహా చర్య గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఆమె ఫొటోషూట్‌ భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సిక్కుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది.

ఈ వ్యవహారంలో నిజాయతీతో దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు.. గురుద్వారాలో ఫొటోషూట్‌పై పాక్​ మోడల్​ సులేహా క్షమాపణలు తెలిపింది. సిక్కుల మనోభావాలను దెబ్బతీయాలని తాను ఆ పని చేయలేదని పేర్కొంది.

అక్కడ దిగిన ఫోటోలను కూడా ఇన్​స్టా నుంచి డిలీట్​ చేసినట్లు తెలిపింది. ఇలాంటి తప్పు మళ్లీ చేయనని స్పష్టంచేసింది.

ఇదీ చూడండి: Article 370: అమిత్​ షా నియోజకవర్గంలో '370' క్రికెట్‌, కబడ్డీ పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.