ETV Bharat / bharat

పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం, 27 ఏళ్లు జైలు శిక్ష, రూ 171 కోట్లు ఫైన్​ - paazee latest news

Paazee Forex Scam పాజీ ఫోరెక్స్​ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు 27 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ 171కోట్ల ఫైన్​ను విధించింది న్యాయస్థానం. రూ 930 కోట్ల ప్రజల పెట్టుబడులను తిరిగి ఇవ్వనందున కోర్టు వారికి ఈ శిక్షను విధించింది.

cheeting case
మోసం కేసు
author img

By

Published : Aug 27, 2022, 2:11 PM IST

Paazee Forex Scam: తమిళనాడులో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కేసు విషయంలో.. కోయంబత్తూర్​ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. తిరుప్పూర్​లో 2009లో స్థాపించిన పాజీ అనే ఆన్​లైన్​ ప్రైవేట్​ కంపెనీ డైరెక్టర్స్​కు శిక్షను విధించింది. ఈ కంపెనీలో ప్రజలు పెట్టుబడిగా పెట్టిన రూ.930 కోట్లను.. తిరిగి ఇవ్వకపోవడం వల్ల 2013లో 1402 మంది బాధితులు వీరిపై కేసు నమోదు చేశారు. 9 సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసులో ఇరువైపుల వాదనలు విన్న కోయంబత్తూర్​ కోర్టు.. నిందితులకు 27 సంవత్సరాల జైలు శిక్ష, రూ.171 కోట్ల జరిమానా​ను విధించింది.

అసలేం జరిగిందంటే.. 2009లో తిరుప్పూర్​లో.. మోహన్​రాజ్​, అతని తండ్రి కతిరవణ్, కమలవళ్లీలు కలిసి పాజీ అనే​ ప్రైవేట్​ కంపెనీని స్థాపించారు. పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించారు. ఇది నమ్మిన ప్రజలు భారీ లాభాలు వస్తాయనే ఆలోచనతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ప్రజలు తమ పెట్టుబడిని తిరిగి ఇవ్వనందున.. 2013లో 1402 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందులో దాదాపు 58,000 మంది పెట్టుబడులు పెట్టినట్లు.. వాటి విలువ రూ.930 కోట్లుగా కోర్టు గుర్తించింది.

నిందితుడు మోహన్​రాజ్​ ఒక సంవత్సరంలోపు డిపాజిట్​ దారులకు వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తానని అభ్యర్థించగా.. కోర్టు దానిని తిరస్కరించింది. దాదాపు 9 సంవత్సరాల పాటు ఇరువైపు వాదనలు విన్న కోర్టు శుక్రవారం తన తీర్పును వెల్లడించింది. డైరెక్టర్స్​లో ఒకరైన కతిరవణ్​ మృతి చెందగా.. మోహన్​రాజ్​, కమలవళ్లీకి కోర్టు.. ఇప్పుడు శిక్ష విధించింది. కేసు వేసిన 1402 మందికి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసును సీబీఐ పోలీసులు సరిగా విచారించలేదంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్కామ్​లో పడిన మొత్తం 58 వేలకుపైగా బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇవీ చదవండి: దళితుడిపై మూకదాడి, బలవంతంగా మూత్రం తాగించి

ఒక చేతిలో కుమారుడు, మరో చేత్తో రిక్షా సవారీ, భార్య ప్రేమ కారణంగా భర్తకు కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.