ETV Bharat / bharat

covid vaccine: దేశంలో 75 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ - 75 కోట్ల టీకాలు

భారత్​లో టీకా పంపిణీ సంఖ్య 75 కోట్లు దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ (covid vaccine) సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరింది.

vaccination
దేశంలో 75 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
author img

By

Published : Sep 13, 2021, 6:17 PM IST

Updated : Sep 13, 2021, 9:19 PM IST

భారత్​లో టీకా పంపిణీ విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం మరో మైలురాయిని అందుకుంది భారత్​. ఇప్పటివరకు 75 కోట్లు డోసుల (covid vaccine) పంపిణీ పుర్తయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ వెల్లడించారు.

'ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన ఏడాదిలో.. 75 కోట్ల టీకాల పంపిణీ జరగడం విశేషం.'

-మన్​సుఖ్​ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

75 కోట్లు డోసులు పంపిణీ పూర్తవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్​ను అభినందించింది. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరిందని కొనియాడింది.

సిక్కిం, హిమాచల్​ప్రదేశ్, గోవా, దాద్రా-నగర్​ హవేలీ, లద్దాఖ్​, లక్షద్వీప్​లలో పెద్దలు అందరూ టీకా తీసుకున్నారు. వీరిలో కొందరు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకోగా.. మరికొందరు ఒక డోసు తీసుకున్నారు.

దేశంలో వ్యాక్సిన్​ పంపిణీ సంఖ్య 10 కోట్లు (covid vaccine) చేరడానికి 85 రోజులు పట్టింది. ఆ తర్వాత క్రమంగా టీకా పంపిణీ పుంజుకుంది. అక్కడి నుంచి వ్యాక్సినేషన్​ సంఖ్య.. 45 రోజుల్లో 20 కోట్లకు, 20 రోజుల్లో 50 కోట్లకు, 19 రోజుల్లో 60 కోట్లకు చేరింది.

విడతల వారీగా చేపట్టిన వ్యాక్సినేషన్​.. జనవరి 16న ​ప్రారంభమైంది.

రాష్ట్రాల్లో కరోనా కేసులు..

  • కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 15,058 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 28,439 మంది కోలుకోగా.. 99 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 16.39 శాతంగా ఉంది.
  • మహారాష్ట్రలో కొత్తగా 2740 మందికి మహమ్మారి సోకింది. ఫిబ్రవరి 9 తర్వాత రాష్ట్రంలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 3233 మంది వైరస్​ను జయించగా.. 27 మంది మృతిచెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 673 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. మహమ్మారి నుంచి 1074 మంది కోలుకోగా.. వైరస్​ ధాటికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొత్త 17 మందికి కరోనా సోకగా.. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.

ఇదీ చూడండి : 'కొవాగ్జిన్​కు ఈ వారంలోనే డబ్ల్యూహెచ్​ఓ గుర్తింపు!'

Last Updated : Sep 13, 2021, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.