ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్​పై నుంచి బస్సు బోల్తా

గాజియాబాద్​లో జరిగిన బస్సు ప్రమాదంలో (Ghaziabad News) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. పలువురు బస్సులో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Ghaziabad accident
గాజియాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్​పై నుంచి బస్సు బోల్తా
author img

By

Published : Oct 14, 2021, 4:19 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Ghaziabad News) జరిగింది. భాటియా మోద్​ ఫ్లైఓవర్​పైన ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకున్నట్లు (Ghaziabad News) అధికారులు వెల్లడించారు.

Ghaziabad accident
బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
Ghaziabad accident
ఫైఓవర్​ నుంచి బోల్తా పడిన బస్సు

దిల్లీలోని నోయిడా నుంచి గాజియాబాద్​కు (Ghaziabad News) ప్రయాణిస్తున్న ఈ బస్సులో 7-8 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టైరు పేలడం వల్ల బస్సు అదుపు తప్పిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనం కూడా బస్సు కింద చిక్కుకున్నట్లు పేర్కొన్నారు.

బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : వెంకయ్య అరుణాచల్​ టూర్​పై చైనా అభ్యంతరం- తిప్పికొట్టిన భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.