ETV Bharat / bharat

కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. 21 మంది ఎమ్మెల్యేలకు ఛాన్స్

Odisha cabinet reshuffle: ఒడిశా కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, అనారోగ్య కారణాల వల్లే అసెంబ్లీ స్పీకర్ పాత్రో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రివర్గంలో చేరడం లేదని ఆయన కుమారుడు స్పష్టం చేశారు.

odisha-new-cabinet
odisha-new-cabinet
author img

By

Published : Jun 5, 2022, 12:56 PM IST

Updated : Jun 5, 2022, 4:26 PM IST

Odisha new cabinet: ఒడిశాలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. బిజు జనతా దళ్ నేతలు జగన్నాథ్ సరక, నిరంజన్ పూజారి సహా 13 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా, మరో 8 మంది స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలోని అందరనీ రాజీనామా చేయాలని శనివారం సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 20 మంది రాజీనామాలు సమర్పించగా.. కొత్త మంత్రివర్గానికి మార్గం సుగమమైంది. భువనేశ్వర్​లోని లోక్​సేవ భవన్ కన్వెన్షన్ సెంటర్​లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒడిశా గవర్నర్ గణేశీ లాల్.. సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమీళా మల్లిక్, ఉషా దేవి, తుకుని సాహును సీఎం.. తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు.

మరోవైపు, శనివారం తన పదవికి రాజీనామా చేసిన అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో.. మంత్రివర్గంలో చేరడం లేదని తెలుస్తోంది. పాత్రో మంత్రివర్గంలో చేరతారని ఊహాగానాలు రాగా.. వాటిని ఆయన కుమారుడు బిప్లవ్ తోసిపుచ్చారు. అనారోగ్య కారణాలతోనే తన తండ్రి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. శనివారం మంత్రి పదవికి రాజీనామా చేసిన బీకే అరుఖా.. స్పీకర్ పదవిని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నవీన్ పట్నాయక్ తన​ మంత్రివర్గాన్ని మార్చినట్లు తెలుస్తోంది. అంతేగాక జూన్​ 20న ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రోమ్​, దుబాయ్​ను సందర్శించనున్నారు. జూన్ 22న శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు ముందే మంత్రివర్గాన్ని మార్చాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం మే 29తో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి రావడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.

ఇదీ చదవండి:

Last Updated : Jun 5, 2022, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.