ETV Bharat / bharat

అన్నదమ్ములను తొక్కి చంపిన ఏనుగు.. కాపాడబోయిన తల్లిదండ్రులకు..! - elephant crushed two brothers

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ఏనుగు ఇద్దరు మైనర్‌ సోదరులను వారి తల్లిదండ్రుల ముందే తొక్కి చంపింది. వివరాల్లోకి వెళ్తే...

two brothers died
ఏనుగు తొక్కి ఇద్దరు అన్నదమ్ములు మృతి
author img

By

Published : Nov 4, 2022, 10:10 PM IST

ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లా కిర్మిరా బ్లాక్‌ పరిధిలోని భౌంరా గ్రామ సమీపంలో ఏనుగు ఇద్దరు మైనర్‌ సోదరులను వారి తల్లిదండ్రుల ముందే తొక్కి చంపింది. పిల్లలను రక్షించే ప్రయత్నంలో దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాకు చెందిన ఉమేష్ రామ్ సత్నామీ, అతని భార్య లెహెరాబాయి సత్నామీ వారి ఇద్దరు కుమారులు ధనంజయ్ (9), అభయ్ (11)తో కలిసి ఒక ఇటుక బట్టీలో పని చేయడానికి గ్రామానికి వచ్చారు. వీరంతా నిద్రిస్తుండగా ఇద్దరు అన్నదమ్ములపై ఏనుగు దాడి చేసింది. ఎంత ప్రయత్నించినా తమ బిడ్డలను తల్లిదండ్రులు కాపాడుకోలేకపోయారు. ఏనుగు తొక్కేయడం వల్ల బాలురు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో ఉమేష్, లెహెరాబాయిలకు గాయాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్పించారు.

ఏడు గజరాజులు
ఈ ప్రాంతంలో చాలా రోజుల నుంచి ఏడు ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.

ఇవీ చదవండి:నిద్ర మత్తులో డ్రైవర్.. బస్సును ఢీకొట్టిన SUV.. 11 మంది మృతి

ఇళ్ల మధ్యలోకి వచ్చి బీభత్సం సృష్టించిన చిరుత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.