ETV Bharat / bharat

అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే! - అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!

బాల్య వివాహాలను అరికట్టేందుకు ఒడిశా ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. కనీస వివాహ వయసు లేకుండా జరుగుతున్న పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేసేలా.. ఆధార్​ కార్డును తప్పనిసరి చేసింది.

Odisha district makes Aadhar mandatory for marriage
అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!
author img

By

Published : Feb 4, 2021, 12:15 PM IST

ఒడిశాలో బాల్య వివాహాలకు అడ్డుకుట్ట వేసేందుకు వధూవరులకు ఆధార్​ కార్డు తప్పనిసరి చేసింది గంజాం జిల్లా పాలనా యంత్రాంగం. ఆధార్​ కార్డు కలిగిన వధూవరులిద్దరూ.. వివాహ వయసు దాటాక సంబంధిత కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని నిబంధన విధించింది.

ఇదీ నిబంధన..

మనువాడబోయే వధూవరులిద్దరూ ఆధార్​ కార్డును కలిగి ఉండాలి. అందులో పుట్టిన తేదీ వివరాలు.. వివాహ వయసుకు అనుగుణంగా ఉండాలి. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను వివాహ నమోదు ప్రక్రియలో ఉపయోగిస్తారు అక్కడి జిల్లా అంగన్​వాడీ కార్యకర్తలు. ఆ తర్వాత సంబంధిత అధికారుల ధ్రువీకరణ అనంతరం పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.

గంజాం జిల్లాలో తెచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల.. 2019-20 ఏడాదిలో సుమారు 172 బాల్య వివాహాలను అడ్డుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాదిలో ఒక్క నెలలోనే సుమారు 62 బాల్య వివాహాలకు అడ్డకట్ట వేశారట.

ఇదీ చూడండి: కళ్లకు గంతలతో పజిల్​ పూర్తి..13 ఏళ్లకే రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.