ETV Bharat / bharat

కేరళలో మరో కొత్త వైరస్​.. అత్యంత ప్రమాదకరం! - నోరోవైరస్​ కేరళ

కేరళలో నోరో వైరస్​ అనే కొత్త వ్యాధి బయటపడింది(kerala virus outbreak). ఓ పశువైద్య కళాశాలకు చెందిన 13మంది విద్యార్థుల్లో ఈ వైరస్​ను గుర్తించారు(norovirus transmission). ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

norovirus
నోరోవైరస్​
author img

By

Published : Nov 12, 2021, 4:20 PM IST

Updated : Nov 12, 2021, 4:41 PM IST

కేరళలో మరో కొత్త వైరస్​ వెలుగు చూసింది. నోరో వైరస్​గా(norovirus transmission) పిలుస్తున్న ఈ వ్యాధి.. రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకింది. వీరందరూ వయనాడ్​ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులని సమాచారం(kerala virus outbreak).

వాంతులు, డయేరియాను ఈ వైరస్​(norovirus 2021) లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

నోరో వైరస్​ అనేది అరుదైన వ్యాధి. కళాశాల క్యాంపస్​ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్​ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్​ఐవీ)కి పంపించారు.

తాజా పరిస్థితులపై అధికారులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్​ సమావేశమయ్యారు. వైరస్​ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

తాగు నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కేరళలో అంతుచిక్కని వ్యాధులు..

అంతుచిక్కని వ్యాధులతో కేరళ తరచూ వార్తల్లో నిలుస్తోంది(kerala virus outbreak ). ఇటీవలే.. కోవలంలో వీధి శునకాలు మృతి చెందటం ఆ ప్రాంతం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. రెండు వారాల్లోనే 20 శునకాలు మృతి చెందాయి. ఇంకా చాలా కుక్కలకు ఈ వ్యాధి సోకి ఉంటుందని అధికారులు తెలిపారు.

శునకాల మృతికి(dog died suddenly) గల కారణాలను తెలుసుకోలేకపోతున్నారు పశుసంవర్ధక శాఖ వైద్యులు. అయితే.. వణుకు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఇంకా చాలా కుక్కలు నీరసంగా కనిపించాయని, అవి కూడా వ్యాధి బారినపడినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన శునకాలు రెండు రోజుల్లోనే మరణిస్తున్నాయన్నారు. ఈ మరణాలకు గాలి ద్వారా వ్యాపించే వైరస్​ ఇన్​ఫెక్షన్​ కారణంగా అనుమానిస్తున్నామని, కనైన్​ డిస్టెంపర్ వైరస్​​ కావచ్చని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మనుషులకు వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.

ఈ వ్యాధికి అత్యంత ఖరీదైన వ్యాక్సిన్​తోనే అడ్డుకట్ట వేయగలమని భావిస్తున్నారు వైద్యులు. అయితే, అలాంటి టీకా ప్రణాళికల నుంచి వీధి శునకాలను తొలగించారని తెలిపారు. ఈ వైరస్​ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నక్కలు, తోడేళ్లలో ఈ కనైన్​ డిస్టెంపర్​ వైరస్​ వ్యాప్తి సాధారణంగా కనిపిస్తుందని తెలిపారు.

కోవలంలో సుమారు 200 వీధి శునకాలు ఉన్నట్లు అంచనా. వైరస్​తో కుక్కలు చనిపోవటంపై ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి:-

కేరళలో 'నిఫా' అలర్ట్- వారందరికీ నెగెటివ్

కరోనాకన్నా నిపా ప్రమాదకరమా? మహమ్మారిగా మారుతుందా?

వధూవరులు ఆ కౌన్సిలింగ్​కు హాజరైతేనే పెళ్లి!

Last Updated : Nov 12, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.