ETV Bharat / bharat

మాజీ ఐపీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు- బేస్​మెంట్​లో 650 లాకర్లు! - మాజీ ఐపీఎస్ రామ్ నారాయణ్ సింగ్

IPS officer IT raids: ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంటి బేస్​మెంట్​లో భారీగా నగదును గుర్తించారు ఐటీ శాఖ అధికారులు. బేస్​మెంట్ నుంచే ఓ కంపెనీని నడిపిస్తున్నట్లు కనుగొన్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సంస్థకు 650 లాకర్లు ఉన్నాయని వెల్లడించాయి.

Noida IPS officer IT raids
Noida IPS officer IT raids
author img

By

Published : Jan 31, 2022, 10:36 AM IST

IPS officer IT raids: ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రామ్ నారాయణ్ సింగ్ ఇంటి బేస్​మెంట్​లో కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. నోయిడా సెక్టార్ 50లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బేస్​మెంట్ నుంచే ఓ సంస్థను నడిపిస్తున్నట్లు కనుగొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ కంపెనీకి 650 లాకర్లు ఉన్నాయని పేర్కొన్నాయి.

Noida IPS officer IT raids premises of his house
మాజీ ఐపీఎస్ అధికారి ఇల్లు

650 lockers in Basement

ఇప్పటివరకు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి సోదాలు మాత్రమే నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి. బినామీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించాయి.

సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇంట్లో నుంచి రికవరీ చేసుకున్న నగదు వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: తాను ఓడినా.. శత్రువు గెలవొద్దు.. యూపీలో 'మాయా' స్కెచ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.