ETV Bharat / bharat

చెన్నైకు తప్పిన 'నివర్' గండం! - Nivar weakens

తీరం దాటిన అతితీవ్ర తుపాను నివర్‌ క్రమంగా బలహీనపడుతోంది. మరికొద్దిగంటల్లో మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. తీరం దాటిన క్రమంలో.. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిశాయి. జనజీవనం స్తంభించింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరద సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం సహా ప్రముఖులు.. బాధితులను పరామర్శిస్తున్నారు.

Nivar weakens into cyclonic storm
బలహీనపడుతున్న నివర్​- సహాయ చర్యలు ముమ్మరం
author img

By

Published : Nov 26, 2020, 6:26 PM IST

అతి తీవ్ర తుపాను‌ నుంచి తీవ్ర తుపానుగా మారిన నివర్‌.. తీరం దాటిన తర్వాత మరింతగా బలహీనపడుతోంది. ‍‌ఈ ఉదయం తీరం దాటిన నివర్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని తాంబరంలో అత్యధికంగా 31.4 సెంటీమీటర్లు, విల్లుపురంలో 28 సెం.మీ. వర్షం కురిసింది.

Nivar weakens into cyclonic storm
జలదిగ్బంధంలో కాలనీలు

ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకూలాయి. తుపాను కారణంగా.. చెన్నైలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఇక్కట్లు పడ్డారు. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు.

దాదాపు 2.27 లక్షల మంది ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

తప్పిన గండం..

నివర్​ తుపాను బలహీనపడుతుండటం వల్ల చెన్నై ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆ ప్రభావం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

వర్షం కారణంగా చెన్నై చెంబరంబాక్కం సరస్సులోకి అధికంగా చేరిన నీటిని దిగువకు వదులుతున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం..

తుపానుతో ప్రభావితమైన ప్రజలను కలిశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి. కడలూరు జిల్లా దేవనంపట్టినంలోని పునరావాస శిబిరంలో బాధితులతో మాట్లాడారు. వారందరికీ వరద సహాయ కిట్లను అందజేశారు.

Nivar weakens into cyclonic storm
కిట్లను అందిస్తున్న సీఎం పళనిస్వామి

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​.. చెన్నై వేలాచెరిలో పర్యటించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించి.. వరద బాధితులకు దుస్తులు, ఆహారపొట్లాలు పంచిపెట్టారు.

Nivar weakens into cyclonic storm
తుపాను​ ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్​
Nivar weakens into cyclonic storm
స్టాలిన్​ సహాయం

పుదుచ్చేరిలో సీఎం పర్యటన..

పుదుచ్చేరిలోనూ నివర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారాయణ స్వామి పర్యటించారు.

Nivar weakens into cyclonic storm
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నారాయణస్వామి
Nivar weakens into cyclonic storm
సీఎం నారాయణస్వామి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.