ETV Bharat / bharat

300కిలోల హెరాయిన్ కేసులో ఎన్​ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్! - ఎన్​ఐఏ రైడ్స్

NIA raids trichy: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) తమిళనాడులోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఎన్​ఐఏ బుధవారం ఈ సోదాలు నిర్వహించింది. మరోవైపు జమ్ము శ్రీనగర్​లో లభ్యమైన తుపాకుల కేసులోనూ సోదాలు నిర్వహించింది.

nia raids trichy
nia raids trichy
author img

By

Published : Jul 20, 2022, 1:56 PM IST

NIA raids trichy: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు ఎన్ఐఏ అధికారులు. గతేడాది కేరళలోని వెలిచంలో 300 కిలోల హెరాయిన్​, ఐదు ఏకే 47 తుపాకులు, తూటాలు దొరికాయి. ఈ కేసును గతేడాది మేలో ఎన్​ఐఏకు బదిలీ చేయగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు శ్రీలంక దేశస్థులను అరెస్ట్ చేశారు. ఎల్​టీఈ ఉద్యమానికి సంబంధించిన అనేక పత్రాలు, సిమ్​ కార్డులను సీజ్​ చేశారు.

మరోవైపు నేరచరిత్ర కలిగిన విదేశీయులపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేపట్టింది. తిరుచ్చిలో నివసిస్తున్న శ్రీలంక, బల్గేరియా, దక్షిణ కొరియా, రష్యా, యూకే, బంగ్లాదేశ్​, కెన్యా దేశాలకు చెందిన 100కు పైగా నేరస్థుల ఇళ్లలో సోదాలు చేసింది. ఎన్​ఐఏ అధికారులతోపాటు స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్​లో పాల్గొన్నారు.

జమ్ములోనూ ఎన్​ఐఏ దాడులు: జమ్ములోని శ్రీనగర్​లో మేలో లభ్యమైన 15 పిస్టళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) దాడులు చేపట్టింది. పుల్వామా, శ్రీనగర్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది. మే 23న 15 పిస్టళ్లతో పారిపోతున్న ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు టీఆర్​ఎఫ్​ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు.

ఇవీ చదవండి: స్కూల్​కు వెళ్లనని ఐదేళ్ల చిన్నారి మారాం.. 17చోట్ల వాతలు పెట్టిన తల్లి

పట్టుబట్టలు.. పూలదండలు.. ఘనంగా కప్పల వివాహం.. వర్షాల కోసమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.