ETV Bharat / bharat

కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదు.. నిందితుడు టీడీపీ సానుభూతిపరుడు కాదు: ఎన్​ఐఏ - కోడికత్తి కేసు వార్తలు

NIA FILED COUNTER IN KODI KATTI CASE: 2019 విశాఖ విమానాశ్రయంలో జగన్​పై కోడికత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో విజయవాడ కోర్టులో ఎన్​ఐఏ కౌంటర్​ దాఖలు చేసింది. దీనిలో పలు అంశాలను పేర్కొంది.

kodikatti case updates
kodikatti case updates
author img

By

Published : Apr 13, 2023, 1:12 PM IST

Updated : Apr 13, 2023, 2:35 PM IST

NIA FILED COUNTER IN KODI KATTI CASE: 2019లో విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్​పై కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విజయవాడ ఎన్​ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. రెండు రోజుల క్రితం విచారణకు హాజరుకాలేనంటూ పిటిషన్​ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోడికత్తి కేసుపై విచారణ జరుపుతున్న నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(NIA) విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో తాజాగా కౌంటర్​ దాఖలు చేసింది. ఆ కౌంటర్​లో పలు విషయాలను ప్రస్తావించింది.

కోడికత్తి ఘటనలో ఎటువంటి కుట్రకోణం లేదని తేలినట్లు ఎన్‌ఐఏ తేల్చిచెప్పింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని తేలినట్లు పేర్కొంది. నిందితుడు శ్రీనివాసరావు.. టీడీపీ సానుభూతిపరుడు కాదని తేలినట్లు తెలిపింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదన్న ఎన్‌ఐఏ.. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేయాలని విన్నవించింది. జగన్​ పిటిషన్‌లో రెస్టారెంట్‌ యజమాని పేరు తప్పుగా రాశారని.. హర్షవర్ధన్ ప్రసాద్ పేరును హర్షవర్ధన్ చౌదరిగా పిటిషన్‌లో రాశారని తెలిపింది. సీసీ కెమెరాలు పని చేయలేదని పిటిషన్‌లో జగన్​ రాశారని.. కానీ సీసీ కెమెరాలు పని చేశాయని.. ఆ ఫుటేజ్‌ను పరిశీలించామని ఎన్‌ఐఏ కౌంటర్లో తెలిపింది. అయితే ఎన్​ఐఏ దాఖలు చేసిన కౌంటర్లపై తమ వాదనలు వినిపించేందుకు సమయం కావాలని జగన్​ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కోడికత్తి ఘటనలో కుట్రకోణం లేదు.. నిందితుడు టీడీపీ సానుభూతిపరుడు కాదు: ఎన్​ఐఏ

నిందితుడి తరపున కౌంటర్​: మరోవైపు కోడికత్తి విచారణకు నిందితుడు శ్రీనివాసరావు విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో విచారణకు హాజరయ్యాడు. జగన్​ వేసిన పిటిషన్లపై గత విచారణలో ఎన్​ఐఏ, నిందితుడిని కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు నిందితుడు తరఫున న్యాయవాది అబ్దుల్ సలీం కౌంటర్ దాఖలు చేశారు. నిందితుడు వేసిన కౌంటర్‌పైన వాదనలకు రెండు రోజులు సమయం కోరుతూ సీఎం జగన్‌ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ జరిగింది: 2019లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్‌.. అక్టోబరు 25న హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఓ యవకుడు ఒక్కసారిగా కోడి పందేల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రస్తుతం విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 13, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.