ETV Bharat / bharat

బీటెక్​తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. జీతం రూ.2 లక్షలకుపైనే! - ఎన్​బీసీసీ ఉద్యోగ ప్రకటన 2022

NBCC recruitment 2022: ఇంజినీరింగ్​లో పట్టా పొందిన అభ్యర్థులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్​బీసీసీ. నాలుగు కీలక విభాగాల్లోని మేనేజర్​ పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆయా పోస్టులను బట్టి జీతం గరిష్ఠంగా నెలకు రూ.2 లక్షలకుపైగా అందనుంది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

NBCC recruitment 2022
ఎన్​బీసీసీ
author img

By

Published : May 22, 2022, 4:27 PM IST

NBCC recruitment 2022: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ నేషనల్​ బిల్డింగ్స్​ కన్​స్ట్రక్షన్​ కార్పొరేషన్​ ఇండియా లిమిటెడ్​(ఎన్​బీసీసీ) మేనేజర్​ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జనరల్​ మేనేజర్​(ఇంజినీరింగ్​), అడిషనల్​ జనరల్​ మేనేజర్​(మార్కెటింగ్​), ప్రాజెక్ట్​ మేనేజర్​(సివిల్​) ఖాళీలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో మొత్తం 23 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొంది ఎన్​బీసీసీ.

జనరల్​ మేనేజర్ ​(ఇంజినీరింగ్​): ఈ కేటగిరీలో మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెలకు జీతం సుమారు రూ.90 వేల నుంచి రూ.2.40 లక్షల వరకు అందనుంది. ఈ పోస్టుకు విద్యార్హతలు సివిల్​ ఇంజినీరింగ్​లో పట్టా లేదా దానికి సమానమైన డిగ్రీ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. మరోవైపు.. పీఎంసీ, ఈపీఎస్​, స్తిరాస్థి రంగం, మౌలిక సదుపాయాల రంగాల్లో కనీసం 15 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

అడిషనల్​ జనరల్​ మేనేజర్​ (మార్కెటింగ్​): ఈ కేటగిరీలో మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. పేస్కేల్​ రూ.80 వేల నుంచి రూ.2.20లక్షలుగా ఉంది. దరఖాస్తుదారు ఎంబీఏ లేదా ఏదైనా రంగంలో రెండేళ్ల పోస్ట్​ గ్యాడ్యుయేషన్​ డిప్లొమా చేసి ఉండాలి. అలాగే.. బిజినెస్​ డెవలప్​మెంట్​ లేదా మార్కెటింగ్​లో 12 ఏళ్ల అనుభవం తప్పనిసరి.

ప్రాజెక్ట్​ మేనేజర్​(సివిల్​): ఈ కేటగిరీలో మొత్తం 15 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జీతం రూ.60వేల నుంచి రూ.1.80 లక్షల వరకు అందనుంది. అభ్యర్థులు సివిల్​ ఇంజినీరింగ్​లో డిగ్రీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్​ ఇంజినీరింగ్​కు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. పీఎంసీ, ఈపీఎస్​, రియల్​ ఎస్టేట్​, ఇన్​ఫ్రాస్టక్చర్​ రంగాల్లో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి.

దరఖాస్తు వివరాలు: పైన పేర్కొన్న పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మే 9 నుంచి జూన్​ 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఎన్​బీసీసీ అధికారిక వెబ్​సైట్​లోని నోటిఫికేషన్​ను చూడాలని సూచించింది సంస్థ.

ఇదీ చూడండి: ఎస్​ఎస్​సీలో 2,065 పోస్టులకు నోటిఫికేషన్​ విడుదల

'సాఫ్ట్​వేర్' కొలువుల జాతర.. TCS, HCL, ఇన్ఫీలో 1.30లక్షల ఉద్యోగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.