మహారాష్ట్రకు చెందిన మయూర్ జైన్ అనే సివిల్ ఇంజినీర్ అరుదైన ఘనత సాధించాడు. 100 రోజుల్లో నిర్మించాల్సిన భవనాన్ని.. కేవలం 43 రోజుల్లోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. 5 మీటర్ల ఎత్తు, 8,415 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న భవన నిర్మాణాన్ని 2022 నవంబర్ 7న నాశిక్‌లో ప్రారంభించాడు మయూర్. ఈ నిర్మాణాన్ని 2022 డిసెంబర్ 20వ తేదీకి పూర్తి చేశాడు.
కేవలం 43 రోజుల్లోనే ఈ భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సర్వే చేయడం మొదలుకొని.. పిల్లర్స్, స్లాబ్స్ వంటి పనులు పూర్తి చేసి వరల్డ్ రికార్డ్స్ ఇండియాలో చోటు సంపాదించాడు మయూర్ జైన్. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేపట్టాడు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని నిర్మాణం వేగవంతంగా పుార్తి అయ్యేలా చేసుకున్నాడు. ఈ నిర్మాణంలో జైన్‌తో పాటుగా.. ప్రాజెక్ట్ మేనేజర్ రజత్ రాజ్‌కుమార్ భాగమయ్యారు. బిల్డింగ్‌లో కాంక్రీట్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక సెన్సార్లను ఉపయోగించారు.