Lokesh Comments After CID Enquiry: గూగుల్‌లో సమాధానాలు లభించే ప్రశ్నలను సీఐడీ విచారణలో అధికారులు తనను అడిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఆరున్నర గంటల పాటు సాగిన విచారణలో మొత్తం 50 ప్రశ్నలు సంధిస్తే.. వాటిల్లో 49 ప్రశ్నలు అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డుతో సంబంధం లేనివే వేశారని వెల్లడించారు. హెరిటేజ్ సంస్థ గురించే అధికారులు ఎక్కువగా ఫోకస్ చేశారని చెప్పారు.
అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు తాడేపల్లి సిట్ కార్యాలయానికి మంగళవారం వెళ్లిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను సీఐడీ దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించింది. ఆయన్ను విచారిస్తున్నంత సేపూ అధికారులు పదే పదే బయటకు వెళ్లి ఫోన్‌కాల్స్ మాట్లాడుతూనే ఉన్నట్లు సమాచారం.
Police Stopped Lunch to Lokesh: లోకేశ్‌కు భోజనం తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
ఏకధాటిగా దర్యాప్తు అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకూ స్పష్టంగా సమాధానమిచ్చారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు ఎలాంటి ఆధారాలు చూపించలేదని లోకేశ్ అన్నారు. రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌కు సంబంధించిన అంశం ఏనాడైనా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వద్ద ప్రస్తావనకు వచ్చిందా అనే ప్రశ్న మినహా మిగతా 49 ప్రశ్నలు కేసుతో సంబంధం లేకుండా అడిగారన్నారు.
పోలవరంపై అలసత్వం, అమరావతి నిర్వీర్యంపై ప్రశ్నించినందుకు, ప్రజా సమస్యలపై నిలదీసినందుకే.. చంద్రబాబుకు రిమాండ్ విధించారని లోకేశ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టు గురించి తెలియదంటున్న జగన్.. డీజీపీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Lokesh Going to Delhi: దిల్లీకి లోకేశ్.. సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ నేపథ్యంలో..
జీవో నెంబర్ 282 ద్వారా రాజధాని ప్రాంతంలో లే అవుట్ రిజిస్ట్రేషన్ నుంచి 99 మందికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిపారు. 99మంది కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం ఆదేశాలనే పాటించామని లోకేశ్ సమాధానమిచ్చినట్లు వివరించారు. బుధవారం కూడా మరోసారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరగా.. తాను దిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఆలస్యమైనా సరే మిగతా ప్రశ్నలు ఇప్పుడే అడగాలని లోకేశ్ వారితో చెప్పారు. అందుకు దర్యాప్తు అధికారి ఒప్పుకోకపోవడంతో.. బుధవారం కూడా విచారణకు వస్తానని లోకేష్ అంగీకరించారు. ఏ తప్పూ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని లోకేశ్ దీమా వ్యక్తం చేశారు.
"హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ప్రశ్నలు, నేను తెలుగుదేశంలో పార్టీలో ఏ పదవులు చేశానో వాటిపై ప్రశ్నలు, హెరిటేజ్‌లో, ప్రభుత్వంలో ఎలాంటి పదవులు నిర్వహించానో అలాంటి ప్రశ్నలు అడిగారు. గూగుల్‌లో వెతికితే లభించే ప్రశ్నలు నన్ను అడిగారు. ఈ ప్రభుత్వంపై ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడినా.. వారిపై దొంగ కేసులు పెట్టి, ఎలాంటి అధారాలు లేకపోయినా మమ్మల్ని ఇలా పిలుస్తారు. మా సమయం ఇలా వృథా చేస్తారు." - లోకేశ్