TDP Nijam Gelavali Program: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు. వచ్చే వారం నుంచి ఆమె రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో వరుస పార్టీ కార్యక్రమాలపై ఆ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Nijam Gelavali Program Deatils: ''నిజం గెలవాలి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో వరుస పార్టీ కార్యక్రమాల నిర్వహణకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
చంద్రబాబు అరెస్టుతో ఆగిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్నితిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్థానంలో నారా లోకేశ్ జనంలోకి వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేశ్.. ఆయన జైలు నుంచి తిరిగి రాగానే పాదయాత్ర కొనసాగించనున్నారు. అప్పటివరకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. 'బాబుతో నేను' కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల వేగం పెంచాలి.'' అని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది.
TDP workers are happy aboutNijam Gelavali Program: సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాల జిల్లాలోని ఆర్.కె. ఫంక్షన్ హాల్ వద్ద ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా నేటికి ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
TDP Launches New Programme: ఇటువంటి సమయంలో టీడీపీ అధిష్ఠానం నిజం గెలవాలి పేరుతో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు నిర్ణయాలు తీసుకోవటం, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుండటం. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు ఉండేలా పార్టీ వర్గాలు ప్రణాళిక సిద్ధం చేయడంపై.. ఆ పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.