ETV Bharat / bharat

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా రియో ప్రమాణం.. ఐదుసార్లు సీఎంగా రికార్డ్​

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు నెఫ్యూ రియో. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. రాజధాని కొహిమాలో జరిగిన ఈ కార్యాక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.

Neiphiu Rio takes oath as Chief Minister

author img

By

Published : Mar 7, 2023, 2:28 PM IST

Updated : Mar 7, 2023, 3:15 PM IST

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు నెఫ్యూ రియో. ఆయనతో పాటు పలువురు మంత్రులను కూడా ప్రమాణం చేయించారు గవర్నర్​ లా గణేశన్​. టీఆర్​ జెలియాంగ్​, వై పట్టోన్​ ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. సోషల్​ మీడియాలో పాపులరైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెమ్జెన్​ ఇమ్నాతో పాటు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరు మహిళ్లలో ఒకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని కొహిమాలో జరిగిన ఈ కార్యాక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.

Neiphiu Rio takes oath as Chief Minister
ముఖ్యమంత్రి రియోను అభినందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)- నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) కూటమి మరోసారి గెలిచింది. 60 స్థానాలున్న నాగాలాండ్​లో ఈ కూటమి 37 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఆధిక్యాన్ని అధికార కూటమి దక్కించుకుంది. అంతకుముందు 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నాగా పీపుల్స్​ ఫ్రంట్​ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు బీజేపీ 12, ఎన్​డీపీపీ 18 స్థానాల్లో విజయం సాధించగా.. ఈ రెండు పార్టీలు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

మంత్రిగా ప్రమాణం చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు తెమ్జెన్​ ఇమ్నా

మహిళ మంత్రిని అభినందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

చరిత్రలో తొలిసారిగా మహిళ ఎమ్మెల్యేలు
60 ఏళ్ల నాగాలాండ్​ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకూ ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 56 ఏళ్ల సల్హౌతునొ క్రుసో, 48 ఏళ్ల హెకానీ జఖాలు విజయం సాధించి చరిత్రకెక్కారు.

నాగాలాండ్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

అంతకుముందు మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్​ సంగ్మా. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. రాజధాని షిల్లాంగ్​లోని రాజ్​భవన్​లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. గవర్నర్​ ఫాగు చౌహాన్​ ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీ నుంచి అలెగ్జాండర్ లలూ హెక్​ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు.

కాగా, ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​లో జరిగే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు రెండు రోజుల పాటు ఇక్కడే పర్యటించనున్నారు మోదీ. అనంతరం అసోంలో నిర్వహించే కేబినెట్​ సమావేశంలో పాల్గొననున్నారు. మార్చి 8న జరిగే త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం ఆయన బుధవారం అగర్తాలాకు బయలుదేరతారు.

ఇవీ చదవండి : మేఘాలయ సీఎంగా కాన్రాడ్​ సంగ్మా ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

జాబ్​ స్కామ్​ కేసులో CBI జోరు.. లాలూపై ప్రశ్నల వర్షం.. భార్యను విచారించిన మరుసటి రోజే..

Last Updated : Mar 7, 2023, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.