ETV Bharat / bharat

చంద్రగ్రహణం తర్వాత నుంచి.. రోజూ రాత్రి ఆ ఇంట్లో మంటలు! అంతుచిక్కని మిస్టరీ!! - uttarakhand after lunar eclipse fire in a house

ఉత్తరాఖండ్​లో అంతుచిక్కని ఓ మిస్టరీ. 8 రోజుల నుంచి ఓ ఇంట్లో మంటలు అంటుకుంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియక కుటుంబం భయంతో బిక్కుబిక్కుమంటోంది.

Mysterious fire in house in uttarakhand
మంటల్లో కాలిపోయిన ఇల్లు, వస్తువులు
author img

By

Published : Nov 17, 2022, 1:25 PM IST

Updated : Nov 17, 2022, 2:36 PM IST

చంద్రగ్రహణం తర్వాత నుంచి మంటలు అంటుకుంటున్న ఇల్లు

ఉత్తరాఖండ్​ హల్ద్వానీ సమీపంలో ఓ ఇంట్లో మంటలు అంటుకుంటున్నాయి. అయితే ఈ మంటలు ఎలా అంటుకున్నాయో తెలియడం లేదు. నవంబరు 8న చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాత నుంచి ఇలా అవుతోందని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. విద్యుత్ శాఖకు ఫోన్ చేసి ఇంటి కరెంట్ కనెక్షన్​ను తప్పించినట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా ప్లాస్టిక్ ఎలక్ట్రికల్ బోర్డులు, వైర్లు కాలిపోతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

mysterious fire in a house
మంటల్లో కాలిన కూలర్
mysterious fire in a house
మంటల్లో కాలిన దుస్తులు

ఇలా 8 రోజుల నుంచి 15-20 సార్లు ఇల్లంటుకుంటుందని చెప్పారు. విద్యుత్ కనెక్షన్ లేకున్నా కూలర్ షార్ట్ సర్క్యూట్​ అయ్యి మంటలు వస్తున్నాయని అంటున్నారు. ఇలా రోజూ మంటలు అంటుకోవటం, వాటిని ఆర్పడం తప్పడం లేదని చెబుతున్నారు. విద్యుత్ శాఖ సాయంతో ఇంట్లో ఎర్తింగ్ కూడా చేశారు. అయినా ఇంట్లో మంటలు చెలరేగుతున్నాయట. దీంతో ఆ కుటుంబ సభ్యులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పుడు ఈ మిస్టరీ ఘటనపై జిల్లా యంత్రాంగం, పోలీసులు విచారణ చేపట్టారు.

mysterious fire in a house
మంటల్లో కాలిన వస్తువులు
mysterious fire in a house
మంటల్లో కాలిన ప్లాస్టిక్ బోర్డ్, వైర్లు

ఇవీ చదవండి:వంతెన కింద భారీగా జిలెటిన్ స్టిక్స్.. రైల్వేట్రాక్ పేల్చిన ప్రాంతానికి సమీపంలోనే

279 మందిని చంపి.. రూ.11కోట్లు సంపాదించిన క్లర్క్.. అంతా 'నకిలీ' మాయ!

Last Updated : Nov 17, 2022, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.