ETV Bharat / bharat

భారీ వర్షాలు.. కుప్పకూలిన మైసూర్​ ప్యాలెస్​ గోడ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే!

author img

By

Published : Oct 19, 2022, 9:23 AM IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు రాజకోట రక్షణ గోడ కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే పురావస్తు శాఖ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గోడ కుప్పకూలిందని నిపుణులు చెబుతున్నారు.

mysore palace fort wall collapsed due to heavy rains in karnataka

Mysore Fort Wall Collapsed: కర్ణాటకలో గతకొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు, మైసూరు సహా పలు నగరాల్లో వరద నీరు ముంచెత్తుతోంది. తాజా వర్షాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు రాజకోట(అంబా విలాస్​ ప్యాలెస్​).. రక్షణ గోడ కుప్పకూలింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, నిపుణులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ కోటను మైసూరు రాజులు.. శత్రువుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు నిర్మించారు.

కుప్పకూలిన మైసూరు రాజ కోట రక్షణ గోడ

అయితే పురావస్తు శాఖ అధికారులు.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే గోడ కుప్పకూలిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోటలో అనేక చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని, అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే ప్యాలెస్​ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే మైసూర్ నగరంలో లాన్ స్టోన్ బిల్డింగ్, దేవరాజ మార్కెట్, ఫైర్ స్టేషన్ సహా పలు వారసత్వ కట్టడాలు కుప్పకూలాయి. వాటికి ఇంకా అధికారులు మరమ్మతులు చేపట్టలేదు.

ఇవీ చదవండి: యూపీ కూలీల హత్యకు ప్రతీకారం.. కశ్మీర్​లో 'హైబ్రిడ్​ ఉగ్రవాది' హతం

హైకోర్టు సీజేనంటూ డీజీపీకి ఫోన్.. తన ఫ్రెండ్​కు క్లీన్ చిట్ ఇవ్వాలంటూ ఒత్తిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.