ETV Bharat / bharat

ఆఫ్తాబ్​ హత్యకు యత్నం.. కత్తులతో దాడి.. శ్రద్ధ ఉంగరం కొత్త గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌! - ఆఫ్తాబ్​ నుంచి స్వాధీనం చేసుకున్న కత్తి

శ్రద్ధావాకర్​ హత్య కేసులో మరో కీలక ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రద్ధా వాకర్​ ఉంగరాన్ని తనతో డేటింగ్​ చేస్తున్న మరో మహిళకు గిఫ్ట్​గా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు పాలీగ్రాఫ్ పరీక్ష ముగిసిన అనంతరం ఆఫ్తాబ్​ను జైలుకు తరలిస్తుండగా చంపడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు.

Shardha Murder Case
Shardha Murder Case
author img

By

Published : Nov 28, 2022, 8:51 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్‌ హత్య కేసులో పోలీసులు మరికొంత పురోగతి సాధించారు. శ్రద్ధావాకర్‌ మృతదేహాన్ని 35ముక్కలుగా కోసేందుకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. హతురాలి ఉంగరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫ్తాబ్‌.. శ్రద్ధా ఉంగరాన్ని తనతో డేటింగ్‌ చేస్తున్న మరో యువతికి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడు ఆఫ్తాబ్‌కు దిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీలో రెండోవిడత పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించారు.

రోహిణిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీలో రెండో విడత పాలీగ్రాఫ్​ పరీక్ష ముగిసిన అనంతరం.. కొందరు దుండగులు ఆఫ్తాబ్​ను తరలిస్తున్న పోలీస్​ వ్యాన్​పై దాడికి యత్నించారు. ఆఫ్తాబ్​ను జైలుకు తరలిస్తున్న సమయంలో కొంత మంది వ్యక్తులు.. కత్తులతో వచ్చి అతడిని చంపడానికి ప్రయత్నించారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకుని.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Shardha Murder Case
ఆఫ్తాబ్​పై కత్తులతో దాడిచేసిన వ్యక్తులు

ఆఫ్తాబ్​కు డ్రగ్​ డీలర్​తో సంబంధాలు..
గుజరాత్‌లోని సూరత్‌లో మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నాడనే అనుమానంతో ఫైసల్‌ మొమిన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి ఆఫ్తాబ్‌ పూనావాలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని వాసైలో ఫైసల్‌ ఉండే ప్రదేశంలోనే అఫ్తాబ్‌ కూడా ఉండేవాడు. గుజరాత్‌ పోలీసులు సాధారణ తనిఖీల సమయంలో ఇతడు దొరికాడు. ఇతడితో పాటు ముంబయికి చెందిన అంకిత్‌ షిండే అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. శ్రద్ధాను హత్య చేసిన రోజు కూడా డ్రగ్స్​ తీసుకున్నట్లు ఆఫ్తాబ్​ స్వయంగా ఒప్పుకున్నాడు. దీంతో ఈ డ్రగ్​ డీలర్​ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.