ETV Bharat / bharat

వాంఖడే అరెస్ట్​పై 'మహా' ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు - ముంబయి డ్రగ్స్​ కేసు

అవినీతి ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఎన్​సీబీ అధికారి సమీర్​ వాంఖడే(sameer wankhede news). అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా అరెస్ట్​పై ముందే నోటీసులు అందిస్తామని కోర్టుకు తెలిపింది మహారాష్ట్ర ప్రభుత్వం.

Narcotics Control Bureau Zonal Director Sameer Wankhede
ఎన్​సీబీ అధికారి సమీర్​ వాంఖడే
author img

By

Published : Oct 28, 2021, 3:49 PM IST

Updated : Oct 28, 2021, 4:11 PM IST

ముంబయి డ్రగ్స్​ కేసులో(mumbai drug case news) తనపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఎన్​సీబీ జోనల్​ అధికారి సమీర్​ వాంఖడే(sameer wankhede news). తనకు అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అలాగే.. ఈ అంశంపై సీబీఐ లేదా ఏదైనా కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు.

సమీర్​ వాంఖడేపై(sameer wankhede news) నాలుగు భిన్న ఫిర్యాదులు అందినట్లు కోర్టుకు తెలిపారు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది. ఏసీపీ స్థాయి అధికారి దర్యాప్తు చేపట్టారని, అయితే ప్రస్తుతానికి ప్రారంభ దశలోనే ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తే 72 గంటల ముందే నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

అరెస్ట్​ చేయటానికి 3 రోజుల ముందే నోటీసులు ఇస్తామని మహా ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపిన నేపథ్యంలో.. వాంఖడే పిటిషన్​ను కొట్టివేసింది కోర్టు.

పార్టీ నిర్వాహకులపై చర్యలేవి: మహా మంత్రి

క్రూయిజ్​ డ్రగ్స్​ కేసు(mumbai drug case news) ఫేక్​ అని తరచుగా ఆరోపణలు చేస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ మరోమారు ఎన్​సీబీ తీరును ప్రశ్నించారు. పార్టీ నిర్వహకులపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆ పార్టీ నిర్వహకుడు ఎన్​సీబీ జోనల్​ అధికారి సమీర్​ వాంఖడేకు స్నేహితుడని పేర్కొన్నారు. 'ఎలాంటి అనుమతి లేకుండా అంత పెద్ద పార్టీ ఎలా నిర్వహించగలిగారు? ఫ్యాషన్​ టీవీ ఇండియా హెడ్​, సమీర్​ వాంఖడే స్నేహితుడైన కాశిఫ్​ ఖాన్​పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ఈ ప్రశ్నలకు వాంఖడే నుంచి సమాధానం కోరుతున్నా' అని పేర్కొన్నారు.

'వాంఖడే తండ్రి పేరు దావూద్​'

సమీర్​ వాంఖడే(sameer wankhede news) మతంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మొదటి భార్య తండ్రి డాక్టర్​ జహీద్​ ఖురేషీ. వాంఖడే కుటుంబం ఇస్లాంను పాటిస్తుందని, ఆయన తండ్రి పేరు దావూద్​ అని పేర్కొన్నారు. తన కూతురితో వివాహం తర్వాత ఇస్లాం మతాన్ని అనుసరించేవారని, తరచుగా మసీదులకు వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు. ఇటీవల తలెత్తిన వివాదం తర్వాతే వాంఖడే హిందువు అనే విషయం తనకు తెలిసినట్లు చెప్పారు.

ఠాక్రేకు వాంఖడే భార్య లేఖ..

డ్రగ్స్​ కేసులో(mumbai drug case news)అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు లేఖ రాశారు ఎన్​సీబీ అధికారి సమీర్​ వాంఖడే భార్య క్రాంతి రెద్కర్​ వాంఖడే. తన కుటుంబం, వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దాడులపై న్యాయం చేయాలని కోరారు. ఈ లేఖను తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేసి మహారాష్ట్ర సీఎంఓను ట్యాగ్​ చేశారు.

మంత్రిపై ఫిర్యాదు

తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించారని మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​పై ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేశారు సమీర్​ వాంఖడే సోదరి యాస్మీన్​ వాంఖడే. సామాజిక మాధ్యమాల వేదికగా తన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, తమ కుటుంబం మాల్దీవులకు వెళ్లడాన్ని దోపిడీ ట్రిప్​గా అభివర్ణిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ గౌరవానికి భంగం కలిగించేందుకు నవాబ్​ మాలిక్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎన్​సీబీతో ప్రజలను వేధిస్తున్నారు: జయంత్​ పాటిల్​

ప్రజలను వేధించటం, వారి పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేందు కోసం ఎన్​సీబీని వినియోగిస్తున్నారని ఆరోపించారు మహా మంత్రి, ఎన్​సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్​ పాటిల్​. పార్టీ నేత నవాబ్​ మాలిక్​కు మద్దతుగా నిలిచారు. ఆయన నిజాలను వెలుగులోకి తెచ్చారని పేర్కొన్నారు. లోతైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: వాంఖడేపై దర్యాప్తు షురూ- వాంగ్మూలం నమోదు చేసిన ఎన్​సీబీ

'రాజీనామా అక్కర్లేదు.. చట్టప్రకారమే వాంఖడే ఉద్యోగం పోతుంది'

Last Updated : Oct 28, 2021, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.