ETV Bharat / bharat

ఏడాది తర్వాత ఏకమైన తల్లీబిడ్డలు.. ఇది ఓ చిన్నారి చిరుత కథ! - ముంబయి లేటస్ట్​ న్యూస్​

ఏడాది క్రితం వేరైన తల్లీబిడ్డలు ఏకమయ్యారు. ఇది మనుషుల కథ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇది ఓ చిరుత కథ. వేరైన ఆ తల్లి బిడ్డలు మళ్లీ ఏలా కలుసుకున్నారో తెలుసుకుందామా..

Leopard cub reunited with its mother in mumbai
Leopard cub reunited with its mother
author img

By

Published : Oct 14, 2022, 2:01 PM IST

తల్లి ప్రేమ అన్నింటికంటే గొప్పదని పెద్దలు అంటుంటారు. ఆ మాట సత్యమని రుజువు చేసింది ఈ ఘటన. ఏడాది క్రితం అమ్మ నుంచి వేరైన చిరుత పిల్లను తిరిగి తల్లి వద్దకు చేర్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు అటవీ అధికారులు. ముంబయిలోని సంజీవ్​ గాంధీ నేషనల్​ పార్క్​ వద్ద గుండెను కలచివేసేలా జరిగిన ఈ కలయిక పలుపురి ప్రశంసలు అందుకుంటోంది.

అసలేం జరిగింది: మానవులపై వరుస చిరుత దాడుల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సి33-డెల్టా అనే ఆడ చిరుతను పట్టుకున్నారు. సాధారణంగా ఆడ చిరుతలు మనుషలకు దూరంగా ఉంటాయని.. అలాంటిది ఈ చిరుత వారిపై దాడి చేయడమేంటా అని అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. డెల్టా చిరుతను పట్టుకున్నప్పటికి దాడులు తీవ్రమవ్వడం వల్ల ఇదంతా దీని పని కాదని తెలుసుకున్నారు. తమ తప్పును గ్రహించిన అటవీ సిబ్బంది దాన్ని తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఓ కంట కనిపెట్టేందుకు దాని మెడకు రేడియో కాలర్​ సైతం కట్టారు. సీ32 అనే మరో ఆడ చిరుత అధికారులకు చిక్కాక ఈ దాడులు ఆగిపోయాయి. ఇదంతా జరిగి ఏడాదయ్యింది.

సరిగ్గా ఏడాది తర్వాత అక్టోబర్​ 10న సంజయ్​ గాంధీ నేషనల్​ పార్క్​ వద్ద కుక్కలు అరుస్తున్న శబ్దాన్ని విన్న భద్రతా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ చిరుత పిల్ల దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. దాన్ని పట్టుకుని అధికారులకు అప్పజెప్పారు. అటవీ అధికారులు ఆ చిరుత పిల్లని వైద్య పరీక్షల నిమిత్తం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అక్టోబర్​ 11న పిల్లను తల్లి వద్దకు చేర్చేందుకు సిద్ధమయ్యారు.

చిరుత పిల్లను బోనులో ఉంచి దాని తలుపు హ్యాండిల్‌కు ఓ తాడును కట్టారు. కట్టిన తాడు ఎవరైనా లాగితే తెలుసుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆ రాత్రి ఏం జరగలేదు. పిల్లను ఎలాగైనా తన తల్లితో కలపాలని నిర్ణయించుకున్న అటవీ శాఖ అధికారులు మరుసటి రోజు బోను దగ్గర ఓ కెమెరా ట్రాప్‌ను ఏర్పాటు చేశారు. దూరం నుంచి బోన్​ను ఓ కంట కనిపెడుతున్నారు.

ఉదయం సుమారు 4.45 గంటల ప్రాంతంలో బోను వద్దకు ఓ చిరుత రావడాన్ని గమనించారు సిబ్బంది. ఆ చిరుతపులి మరెవరో కాదు సీ33-డెల్టా. తన తల్లిని చూసిన ఆనందాన్ని చిన్నారి చిరుతలో గమనించారు అధికారులు. ఆ పులి ఆ కూన తల్లే అని తెలుసుకుని పంజరాన్ని తెరిచారు. కాసేపటికి ఆ రెండు చిరుతలు అడవిలోకి వెళ్లిపోయాయి.

ఇదీ చదవండి: హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం

పది నెలల్లో 13 మంది బలి.. ఎట్టకేలకు చిక్కిన 'సీటీ-1' పులి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.