Youngest Sarpanch In India: దేశంలోనే అత్యంత చిన్నవయసులో సర్పంచ్‌గా ఎన్నికై మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ యాదవ్ రికార్డు సృష్టించారు. విదిశ జిల్లాకు చెందిన ఆయన.. ఆదివారం వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించారు. సరేఖో గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు అనిల్.
12 ఓట్ల తేడాతో విజయం.. సర్పంచ్ పదవికి పోటీ పడేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించిన అర్హత వయసు 21ఏళ్లు. కాగా.. అనిల్ యాదవ్ 21ఏళ్ల ఆరు నెలల వయసు ఉన్నప్పుడు నామినేషన్ దాఖలు చేశారు. భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ మేనల్లుడు వివేక్ శర్మపై 12ఓట్ల తేడాతో విజయం సాధించారు. గెలుపొందిన అనంతరం మాట్లాడిన అనిల్ యాదవ్.. జిల్లా పాలనాధికారితో పాటు తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
'సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు కావాల్సిన వయసు 21ఏళ్లు. సరేఖో గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికైన అనిల్ యాదవ్ వయసు 21ఏళ్ల ఆరు రోజులు. ఈయన దేశంలోనే అతిపిన్న వయసు గల సర్పంచ్' అని ఎస్డీఎం ప్రవీణ్ ప్రజాపతి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: వాడీవేడీగా అఖిలపక్ష భేటీ.. వాటిపై కాంగ్రెస్ ఫైర్.. కేంద్రం కౌంటర్!