ETV Bharat / bharat

సీఎం సొంత గ్రామంలో నీటి కష్టాలు.. విపక్షం ఫైర్​

సొంత గ్రామంలో పర్యటించిన మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​కు అక్కడి నీటి కష్టాలను చెప్పుకున్నారు గ్రామస్థులు. వెంటనే అధికారులపై మండిపడ్డారు సీఎం. నీటి కుళాయిలను కూడా నేనే చూసుకోవాలా? అని ప్రశ్నించారు. 15రోజుల్లో పరిస్థితిని మరోమారు సమీక్షిస్తానని, అప్పటికల్లా సమ్యను పరిష్కరించాలని తేల్చిచెప్పారు. మరోవైపు సీఎం సొంత గ్రామంలోనే నీటి సంక్షోభం ఉంటే.. ఇక ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటని కాంగ్రెస్​ మండిపడింది.

sehore news
సీఎం సొంత గ్రామంలో నీటి కష్టాలు.. విపక్షం ఫైర్​
author img

By

Published : Nov 7, 2021, 4:42 PM IST

సొంత గ్రామంలో మంచి నీటి సమస్యపై అధికారులను ముఖ్యమంత్రి మందలించడం.. విపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది. సీఎం ఊర్లోనే ఇలా ఉంటే.. ఇతర ప్రాంతాల సంగతేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.

ఏం జరిగింది?

మధ్యప్రదేశ్​ శిహోర్​ జిల్లాలో పర్యటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​. అదే జిల్లాలోని ఆయన సొంత గ్రామం జైట్​ను శనివారం సందర్శించారు. అక్కడ జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొందరు సీఎంను కలిశారు. గ్రామంలోని నీటి కష్టాలను సీఎం ముందు చెప్పుకున్నారు. గ్రామస్థుల ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం అధికారులపై మండిపడ్డారు.

"జల్​ నిఘమ్​ ఏం చేస్తోంది? నా సొంత గ్రామానికే నీటిని సరఫరా చేయడం లేదు. ప్రతి దరఖాస్తును పరిశీలించి, నీళ్ల కుళాయిని ఇవ్వడం నా బాధ్యతా? 15రోజుల తర్వాత పరిస్థితులను మళ్లీ సమీక్షిస్తాను. ఒక్క ఫిర్యాదు అందినా.. ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండరు. ఇది సరైన పద్ధతి కాదు. కుళాయిలో నుంచి నీళ్లు వస్తున్నాయా? లేదా? అని సీఎం చూడాలా? చిన్న చిన్న విషయాలకు కూడా ప్రజలు సీఎం వద్దకు రావాల్సిందేనా? సర్వే నిర్వహించి, నీటి సరఫరాపై 15రోజుల్లో నివేదిక అందించాలి," అని శివరాజ్​సింగ్​ మండిపడ్డారు.

  • यह स्थिति है 17 वर्ष के मुख्यमंत्री शिवराज सिंह जी के ख़ुद के क्षेत्र व ज़ैत गाँव की , लोगों को पीने का पानी ही नही मिल पा रहा है , इतनी सारी शिकायतें…?

    बाक़ी प्रदेश की स्थिति समझी जा सकती है…

    “ शिवराज जी कहिन - कोई मुख्यमंत्री हम्माली करेगा क्या “….? pic.twitter.com/b4EniD5POT

    — Narendra Saluja (@NarendraSaluja) November 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. 17ఏళ్ల పాటు సీఎం బాధ్యతలు చేపట్టిన వ్యక్తి సొంత గ్రామంలోనే నీటి సంక్షోభం ఉంటే.. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటి? అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ఇదీ చూడండి:- అప్పటివరకు ఈడీ కస్టడీలోనే మాజీ హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.