ETV Bharat / bharat

పెళ్లికి పిలవలేదని వరుడ్ని చితకబాదిన స్నేహితుడు - పెళ్లికి పిలవలేదని కొట్టిన పరిచయస్థుడు

పెళ్లికి పిలవలేదని వరుడిని ఓ వ్యక్తి చితకబాదాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ భిండ్ జిల్లాలోని చందుపురలో జరిగింది. ​

marriage inviting
పెళ్లికి పిలవలేదని, వరుడుని కొట్టి పరిచయస్థుడు
author img

By

Published : Aug 24, 2021, 6:11 PM IST

వివాహానికి పిలవలేదని వరుడిని తీవ్రంగా కొట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్​ భిండ్​ జిల్లాలోని చందుపురలో జరిగింది. దీనిపై పెళ్లి కొడుకు​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు నరేంద్ర కుష్వాహపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కరోనా ఆంక్షల కారణంగా తాను తెలిసిన వారందరినీ పెళ్లికి పిలవలేకపోయినట్లు బాధితుడు చెప్పాడు. కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహం చేసుకున్నట్లు పోలీసులకు వివరించాడు. దీనిపై కోపం తెచ్చుకున్న కుష్వాహ పరుష పదజాలంతో దూషిస్తూ, తనపై దాడి చేసినట్లు పేర్కొన్నాడు.

ఇదీ జరిగింది...

బాధితుడు ఇటీవలే వివాహం చేసుకున్నాడు. కరోనా ఆంక్షల వల్ల పెళ్లికి అందరినీ పిలవలేకపోయాడు. తనను ఆహ్వానించనందుకు రూ. 500 ఇవ్వాలని బాధితుడ్ని నరేంద్ర అడిగాడు. ఆ మొత్తంతో తాను మద్యం తాగుతానని చెప్పాడు. అయితే తన దగ్గర రూ. 100 మాత్రమే ఉందని ఇచ్చాడు. ఇంకా కావాలని కుష్వాహ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తనపై దాడి చేసినట్లు బాధితుడు వివరించాడు.

ఇదీ చూడండి: కుమారుడి కోసం కిడ్నాపర్లకు రూ.3 కోట్లు ఇచ్చి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.