ETV Bharat / bharat

ఎవరెస్ట్​ ఎక్కిన 15 రోజుల్లోనే 'మకాలు' పర్వతం అధిరోహణ.. యువతి రికార్డ్​!

Mountaineer Savita Kanswal: ప్రపంచంలోనే ఐదో ఎత్తయిన పర్వతం మకాలును అధిరోహించి జాతీయ రికార్డ్​ నెలకొల్పింది ఉత్తరాఖండ్​కు చెందిన యువతి. ఎవరెస్ట్​ పర్వతాన్ని చుట్టేసిన పదిహేను రోజుల్లోనే మకాలును ఎక్కి ఔరా అనిపించింది. ఆమెనే పర్వతారోహకురాలు సవిత కన్స్వాల్​.

Mountaineer Savita Kanswal
పర్వతారోహకురాలు సవిత కన్స్వాల్
author img

By

Published : Jun 3, 2022, 7:42 AM IST

'మకాలు' పర్వతం అధిరోహించి యువతి రికార్డ్​

Mountaineer Savita KanswalL: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన మకాలు పర్వతాన్ని (8463 మీటర్లు) అధిరోహించి ఓ యువతి జాతీయ రికార్డ్​ నమోదు చేసింది. మే 12న ఎవరెస్ట్​ శిఖరంపై భారత జాతీయ జెండా ఎగురవేసిన పదిహేను రోజులకే.. మే 28న మకాలు పర్వతంపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఔరా అనిపించింది.

ఉత్తరాఖండ్​, ఉత్తరకాశీ జిల్లాలోని భట్వాడి బ్లాక్​ లోంథ్రూ గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు సవిత కన్స్వాల్​ ఈ రికార్డును సాధించింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన సవిత.. ఉత్తరకాశీలోని నెహ్రూ పర్వతారోహణ ఇన్​స్టిట్యూట్​లో పర్వతారోహణపై బేసిక్​ కోర్స్​ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆ వర్సిటీలోనే శిక్షకురాలిగా విధులు నిర్వర్తించింది. పర్వతారోహణలో జాతీయ రికార్డు నెలకొల్పటంపై వర్సిటీ ప్రధానాధ్యాపకులు అమిత్​ బిస్త్​, పర్వతారోహకులు విష్ణు సెమ్వాల్​ సహా పర్వతారోహణ అసోసియేషన్​ సంతోషం వ్యక్తం చేసింది.

ఎవరెస్ట్​, మకాలు పర్వతాలను అధిరోహించటం కంటే ముందే పలు పర్వతాలను చుట్టేసింది సవిత. అందులో త్రిశూల్​ పర్వతం (7120మీటర్లు), హనుమాన్​ టిబ్బా(5930 మీటర్లు), కొలహాయ్​(5400 మీటర్లు), ద్రౌపది దండా(5680మీటర్లు), తులియాన్​ పీక్​(5500మీటర్లు)లతో పాటు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద శిఖరం లోట్సే పర్వతం(8516 మీటర్లు) సైతం ఉన్నాయి. పర్వాతారోహణలో రికార్డులు నెలకొల్పిన ఆమె కుటుంబం ఇప్పటికీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది.

ఇదీ చూడండి: Mountaineer Rohit: 'నాన్నకు ప్రేమతో.. నీ కోసం ఎవరెస్ట్ అధిరోహిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.