ETV Bharat / bharat

1984లో గల్లంతైన జవాన్ ఆచూకీ ఇన్నేళ్లకు లభ్యం, దారి చూపిన డిస్క్​లు - LNk Chander Shekhar body found

ఆ జవాను కనిపించకుండా పోయి 38 ఏళ్లు దాటింది. ఏమైపోయారో, అసలు ఉన్నారో లేదో తెలియకుండానే అనేక సంవత్సరాలుగా దిగులుతో గడుపుతోంది ఆయన కుటుంబం. అలాంటి వారికి ఇప్పుడు కీలక వార్త చెప్పారు ఇండియన్ ఆర్మీ అధికారులు.

missing jawan found
1984లో గల్లంతైన జవాన్ ఆచూకీ ఇన్నేళ్లకు లభ్యం
author img

By

Published : Aug 15, 2022, 5:53 PM IST

Updated : Aug 15, 2022, 6:26 PM IST

38 ఏళ్ల క్రితం మంచు తుపాను కారణంగా గల్లంతైన జవాను ఆచూకీని ఎట్టకేలకు గుర్తించింది భారత సైన్యం. సియాచిన్​ వద్ద హిమాలయాల్లో ఓ మంచుదిబ్బ వద్ద రెండు మృతదేహాల్ని జవాన్లు కనుగొన్నారు. అక్కడే లభించిన ఐడెంటిఫికేషన్ డిస్క్​పై ఉన్న సంఖ్య ఆధారంగా ఆ అమర సైనికుడిని లాన్స్ నాయక్ చంద్రశేఖర్​గా గుర్తించారు. ఇండియన్ ఆర్మీ నార్తర్న్ కమాండ్​ సోమవారం ఈ విషయం వెల్లడించింది. మరో మృతదేహం ఎవరిదో గుర్తించాల్సి ఉందని తెలిపింది.

పాక్​పై పోరాడుతూ..
19 కుమావోన్ రెజిమెంట్​లో సభ్యుడైన చంద్రశేఖర్ హర్బోలా స్వస్థలం ఉత్తరాఖండ్​ అల్మోరా జిల్లాలోని ద్వారాహట్. 1975లో సైన్యంలో చేరారు. లాన్స్​ నాయక్ హోదాలో భారత సైన్యంలో పని చేసేవారు. రక్తం గడ్డ కట్టించే చలిలో.. హిమాలయాల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించేవారు. మృత్యువును సైతం లెక్కచేయకుండా మంచు పర్వతాలపై గస్తీ కాసేవారు. 1984లో 'ఆపరేషన్ మేఘ్​దూత్​'లో భాగంగా పాకిస్థాన్​తో పోరాడేందుకు చంద్రశేఖర్ సహా మొత్తం 20 మంది జవాన్ల బృందాన్ని రంగంలోకి దింపింది భారత సైన్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రమైన సియాచిన్​లో వారిని మోహరించింది.

ఓ హిమానీనదం వద్ద వారంతా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు చంద్రశేఖర్. మే 29వ తేదీన ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. చంద్రశేఖర్ సహా మొత్తం 20 మందిని మంచు రక్కసి మింగేసింది. సైన్యం 15 మంది మృతదేహాల్ని వెలికితీసింది. ఎంత ప్రయత్నించినా మిగిలిన ఐదుగురి ఆచూకీ దొరకలేదు. అలా గల్లంతైన వారిలో చంద్రశేఖర్ ఒకరు.

చంద్రశేఖర్​ గల్లంతు కావడానికి 9 ఏళ్ల ముందు.. అల్మోరాకు చెందిన శాంతి దేవితో ఆయనకు వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు(వయసు 4 ఏళ్లు, ఏడాదిన్నర). అప్పుడు శాంతి దేవి వయసు 28 సంవత్సరాలు. అప్పటినుంచి చంద్రశేఖర్ కుటుంబసభ్యులు ఆయన పరిస్థితి ఏంటో తెలియకుండానే గడుపుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్​ హల్​ద్వానీలో నివాసం ఉంటున్నారు.

missing jawan found
చంద్రశేఖర్​ ఐడెంటిఫికేషన్ డిస్క్​లు

దారి చూపిన డిస్క్​లు..
అనూహ్యంగా ఇన్నేళ్లకు సియాచిన్​లో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికులకు మంచులో రెండు మృతదేహాలు కనిపించాయి. ఒకదానికి ఐడెంటిఫికేషన్​ డిస్క్​లు ఉన్నాయి. వాటిపై ఆర్మీ నంబర్ రాసి ఉంది. అధికారులు వెంటనే రికార్డులన్నీ తిరగేశారు. ఆ మృతదేహం లాన్స్ నాయక్ చంద్రశేఖర్​దేనని ఆదివారం నిర్ధరించారు. మరొకటి ఎవరిదో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
చంద్రశేఖర్​ మృతదేహం లభ్యమైన విషయాన్ని హల్​ద్వానీ సబ్​ కలెక్టర్ మనీశ్ కుమార్, తహసీల్దార్ సంజయ్ కుమార్.. స్వయంగా వెళ్లి శాంతి దేవి కుటుంబానికి తెలియజేశారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Aug 15, 2022, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.