ETV Bharat / bharat

అర్పిత ఇంట్లో మళ్లీ భారీగా నోట్ల కట్టలు.. యంత్రాలతో లెక్కించేసరికి... - పార్థా ఛటర్జీ న్యూస్

Arpita mukherjee news: బంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని లెక్కించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకురావాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

arpita mukherjee news
arpita mukherjee news
author img

By

Published : Jul 27, 2022, 10:27 PM IST

Updated : Jul 28, 2022, 9:01 AM IST

Arpita mukherjee news: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అరెస్టయిన బంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గత శుక్రవారం ఈడీ జరిపిన సోదాల్లో ఆమె ఇంట్లో రూ.21కోట్లు బయటపడగా.. తాజాగా మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగించిన ఈడీ అధికారులు ఆమె అపార్ట్‌మెంట్‌లోని షెల్ఫ్‌లో నోట్ల కట్టలు గుర్తించినట్టు సమాచారం. వీటిని లెక్కించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకురావాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అయితే, బుధవారం రాత్రి వరకు వాటిని లెక్కించిన అధికారులు.. రూ.20 కోట్లు ఉన్నట్లు తేల్చారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.

arpita mukherjee news
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు
arpita mukherjee news
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు
Arpita mukherjee news
నగదు లెక్కింపు యంత్రాలను తీసుకువస్తున్న సిబ్బంది

ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో గత శుక్రవారమే అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు.. శనివారం మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆమెనూ అరెస్టు చేశారు. వీరిద్దరికీ ఆగస్టు 3వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించడం వల్ల ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతున్న వేళ మళ్లీ భారీగా నోట్ల కట్టలు బయటపడటం గమనార్హం. అయితే, గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.

"నా ఇంట్లోని ఒక గదిలో పార్థా ఛటర్జీ డబ్బు దాచేవారు. ఆ గదికి మంత్రి, ఆయన మనుషులకు మాత్రమే ప్రవేశం ఉండేది. ప్రతి పదిరోజులలొకసారి ఛటర్జీ మా ఇంటికి వచ్చేవారు. నా ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకులా ఉపయోగించుకునేవారు. ఆ మహిళ కూడా ఆయనకు సన్నిహితురాలే. ఆ గదిలో ఎంత డబ్బు ఉంచారో మంత్రి ఏనాడు చెప్పలేదు" అని అర్పిత విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ నేరారోపణలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్పిత ఇంట్లో అధికారులు ఒక 40 పేజీల డైరీని స్వాధీనం చేసుకోగా.. దాంట్లో దర్యాప్తునకు అవసరమైన కీలక సమాచారం లభించొచ్చని భావిస్తున్నారు.

ఇవీ చదవండి: ఇంటి కింద పది కోట్లు.. ఒకే చెట్టుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉరి!

ఉద్రిక్తతలకు దారితీసిన భాజపా నేత హత్య.. ఎంపీ, ఎమ్మెల్యేలకు నిరసన సెగ

Last Updated : Jul 28, 2022, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.