ETV Bharat / bharat

Mohammad Akbar Lone Centre : అసెంబ్లీలో పాక్​కు జైకొట్టిన ఎమ్మెల్యే.. సుప్రీంకోర్టులో ఊహించని షాక్ - మహ్మద్​ అక్బర్​ లోన్​ అసెంబ్లీలో నినాదాలు

Mohammad Akbar Lone Centre : జమ్ముకశ్మీర్​ అసెంబ్లీలో పాక్​స్థాన్​కు మద్దతుగా నినాదాలు చేసిన ఎన్​సీ పార్టీ నేత మహ్మద్​ అక్బర్​ లోన్​.. రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా అందులో పేర్కొనాలని తెలిపింది.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 1:41 PM IST

Updated : Sep 4, 2023, 5:29 PM IST

Mohammad Akbar Lone Centre : 2018లో జమ్ముకశ్మీర్​ అసెంబ్లీలో ఎన్​సీ పార్టీ నేత మహ్మద్​ అక్బర్​ లోన్​.. 'పాకిస్థాన్​ జిందాబాద్'​ అంటూ నినాదాలను చేసినందుకు.. తాను భారత రాజ్యాంగానికి విధేయత చూపుతున్నట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా అందులో పేర్కొనాలని తెలిపింది.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370 రద్దును సవాల్​ చేసిన వారిలో ప్రధాన పిటిషనర్​ అయిన అక్బర్​ లోన్​.. మంగళవారంలోగా అఫిడవిట్ దాఖలు చేస్తారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ ధర్మాసనం కోరినట్లు అఫిడవిట్ దాఖలు చేయకపోతే.. అక్బర్​ లోన్ తరఫున తాను వాదించనని సిబల్​ స్పష్టం చేశారు.

అంతకుముందు.. 2018లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్థాన్ జిందాబాద్' అని నినదించినందుకు కేంద్రానికి అక్బర్​ లోన్​ క్షమాపణ చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ ధర్మాసనం ముందు వాదించారు. రాజ్యాంగానికి అక్బర్ లోన్​​.. విధేయత చూపుతున్నట్లు ప్రకటించాల్సి ఉందని మెహతా చెప్పారు. సభా వేదికపై అలా నినాదాలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు.
అయితే అక్బర్​ తరఫున​ వాదనలు వినే సమయంలో ఆయన నుంచి క్షమాపణలు చెపుతున్నట్లు ప్రకటన కోరతామని సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. దినపత్రికల్లో వచ్చిన పలు వార్తలను చూశామని, కోర్టులో సమర్పించిన వాటిని కూడా గమనించామని ధర్మాసనం పేర్కొంది.

సీనియర్​ నాయకుల నుంచి వచ్చిన వివిధ రకాలైన ప్రకటనలు.. సొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయని సొలిసటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. కోర్టుకు తెలిపారు. ఒకవేళ వారు అలాంటి నినాదాలపై క్షమాపణలు చెప్పకపోతే.. అది ఇతరులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్​లో సాధారాణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు చేపట్టిన వివిధ రకాల చర్యలపై కూడా ప్రభావం ఉంటుందని వివరించారు.

సెప్టెంబర్​ 1న కొందరు కశ్మీరీ​ పండితులతో కూడిన బృందం.. అక్బర్ లోన్​ను వేర్పాటువాద శక్తులకు మద్దతుదారుడని పేర్కొంటూ అతడి అర్హతలను సుప్రీం కోర్టులో ప్రశ్నించింది. రూట్స్​ ఇన్​ కశ్మీర్​ అనే ఎన్​జీఓ సంస్థ కూడా ఈ విషయంలో వాస్తవాలను గుర్తించాలని కోరింది. అతడు జమ్ముకశ్మీర్​లో వేర్పాటువాద శక్తులకు మద్దతుదారుడని ఆరోపించింది.

'కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా ఆర్టికల్ 370ని రద్దు చేయలేరా? ఇదేం నిబంధన?'

Jammu Kashmir Election : 'జమ్ముకశ్మీర్​లో ఏ క్షణమైనా ఎన్నికలు.. తుది నిర్ణయం వారిదే'

Last Updated : Sep 4, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.