ETV Bharat / bharat

అంతర్జాతీయ సౌరకూటమిలోకి అమెరికా

అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance) లో అమెరికా చేరడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సౌర శక్తిని వినియోగించుకునే భాగస్వామ్య అన్వేషణలో అమెరికా చేరడం కూటమిని మరింత బలోపేతం చేసిందని అన్నారు.

International Solar Alliance
అంతర్జాతీయ సౌరకూటమి
author img

By

Published : Nov 11, 2021, 5:34 AM IST

భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance) లో 101వ సభ్య దేశంగా అమెరికా చేరింది. ఈ మేరకు గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ 26 సదస్సులో భాగంగా అమెరికా ప్రత్యేక ప్రతినిధి జాన్ కెర్రీ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వహించిన అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కెర్రీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని మరింత వేగంగా విస్తరించడానికి ఇది ఒక ముఖ్యమైన సహకారమని కెర్రీ అన్నారు.

అంతర్జాతీయ సౌర కూటమి- (ఐఎస్​ఏ)లో అమెరికా చేరడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సౌర శక్తిని వినియోగించుకునే భాగస్వామ్య అన్వేషణలో భాగంగా అమెరికా తీసుకున్న నిర్ణయం కూటమిని మరింత బలోపేతం చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు.

ఐఎస్​ఏ కూటమిలో అమెరికా చేరిన సందర్భంగా పలువురు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. 2015 నవంబర్‌లో ప్యారిస్‌లో జరిగిన సీఓపీ-21 సమావేశాల సందర్భంగా భారత ప్రధాని న‌రేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి ఐఎస్​ఏను ప్రారంభించారు.

ఇదీ చూడండి: '150 మందిని బలితీసుకున్న వారితో ప్రధాని చర్చలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.