ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల కృషిపై జపాన్ నూతన ప్రధాని ఫుమియో కిషిడాతో (India Japan Modi) చర్చించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానిగా ఎన్నికైన కిషిడాను అభినందించినట్లు పేర్కొన్నారు. భారత్- జపాన్ల బంధం మరింత బలోపేతం చేసే దిశగా ఇరు దేశాలు (India Japan Modi) కృషి చేస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు గురువారం మోదీ ట్వీట్ చేశారు.
భారత్- జపాన్ల మధ్య ఉన్న అంతర్జాతీయ భాగస్వామ్యంపై (Modi and Japan Prime Minister) ఇరు దేశల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది. టెక్నాలజీ సహా భవిష్యత్తులో రాణించే రంగాలపై కృషి చేసేందుకు అంగీకరించినట్లు తెలిపింది.
ఘనంగా ద్వైపాక్షిక మారిటైమ్..
జపాన్-ఇండియా ద్వైపాక్షిక మారిటైమ్...ఐదో విడత విన్యాసాలు ముగిశాయి. అరేబియా సముద్రంలో అక్టోబర్ 6 నుంచి 8 వరకు జరిగిన విన్యాసాల్లో (Maritime Exercise) భారత నౌకాదళం, జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ పాల్గొన్నాయి. సముద్ర తీర రక్షణ అంశంలో పరస్పర సహకారం అందిపుచ్చుకునే దిశగా.. రెండు దేశాల నౌకాదళాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఇందులో భారత్‌కు చెందిన మిగ్ 29 కె యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ టగ్ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. జపాన్ యుద్ధ నౌకలు కగ, మురసమె ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి.
ఇదీ చూడండి : 'లఖింపుర్' కేసులో యూపీ ప్రభుత్వంపై సుప్రీం అసహనం