ETV Bharat / bharat

'అమ్మను చూస్తే సమయపాలన ఎలా చేయాలో తెలుస్తుంది'.. పరీక్ష పే చర్చలో విద్యార్థులతో మోదీ - Telangana student Akshara questioned Modi

విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమ వృదా కాదన్నారు. శుక్రవారం దిల్లీలో జరిగిన పరీక్ష పే చర్చ-2023 కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

modi pariksha pe charcha 2023
మోదీ పరీక్ష పే చర్చ 2023
author img

By

Published : Jan 27, 2023, 12:39 PM IST

Updated : Jan 27, 2023, 1:47 PM IST

చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి నచ్చిన రంగంలో పిల్లలను ప్రోత్సహించాలన్నారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారని చెప్పారు. ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో తెలుస్తుందని విద్యార్థులకు సూచించారు. పరీక్ష పే చర్చ-2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ.. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు.

"విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలి. ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమ వృథా కాదు. కొంత మంది విద్యార్థులు వారి క్రియేటివిటిని పరీక్షల్లో చీటింగ్​ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. ఆ క్రియేటివిటి మంచి మార్గానికి వాడుకుంటే విజయాన్ని అందుకుంటారు. పరీక్ష పే చర్చ.. నాకు పరీక్షలాంటిదే. దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఈ పరీక్ష నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. ఒత్తిడిలో ఉండకండి! ఆలోచించండి, విశ్లేషించండి, పని చేయండి, ఆపై మీరు కోరుకున్నది సాధించడానికి మీ వంతు కృషి చేయండి."

-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంలో పలువురు విద్యార్థులు ప్రధాని మోదీని ప్రశ్నించారు. అందుకు ప్రధాని సైతం ఓపికగా సమాధానమిచ్చారు. తెలంగాణకు చెందిన అక్షర అనే విద్యార్థిని.. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాల్సి ఉందని మోదీని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు సమాధానమిచ్చిన మోదీ.. కార్మికులు నివసించే చిన్న బస్తీలోని ఒక చిన్నారి కథను ఉదాహరణగా చెప్పారు. ఎనమిదేళ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళ్ మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. "బస్తీలో నివసించే 8 ఏళ్ల చిన్నారి అన్ని భాషలు మాట్లాడటం ఎలా సాధ్యమైందో తెలుసుకున్నా. ఆ చిన్నారి ఇంటి పక్కన నివసించే వారు ఒక్కో రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చిన వారంతా ఒక దగ్గర నివసించడం వల్ల వారితో నిత్యం మాట్లాడుతూ.. ఆ చిన్నారి అన్ని భాషలు నేర్చుకుంది. అన్ని భాషలు నేర్చుకునేందుకు ఆ చిన్నారి చూపిన చొరవ అభినందనీయం. బహు భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు." అని మోదీ బదులిచ్చారు.

modi-pariksha-pe-charcha-2023
పరీక్ష పే చర్చ 2023 పాల్గొన్న విద్యార్థులు
modi-pariksha-pe-charcha-2023
మోదీ పరీక్ష పే చర్చ 2023

2023 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాంలో సుమారు 38.80 లక్షల మంది పాల్గొన్నారు. విద్యార్థులు- 31.24 లక్షలు, ఉపాధ్యాయులు - 5.60 లక్షలు, తల్లిదండ్రులు - 1.95 లక్షల మంది ఉన్నారు. గతేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో దాదాపు 15.7 లక్షల మంది పాల్గొన్నారు.

modi-pariksha-pe-charcha-2023
పరీక్ష పే చర్చలో మోదీని ప్రశ్నించిన అక్షర అనే తెలంగాణ విద్యార్థిని

Last Updated : Jan 27, 2023, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.