ETV Bharat / bharat

Modi On Congress : 'కాంగ్రెస్​ తుప్పు పట్టిన ఇనుము లాంటిది.. వర్షంలో పెడితే పూర్తిగా నాశనం!' - pm modi bhopal speech

Modi On Congress : మధ్యప్రదేశ్‌లో చాలా కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని బిమారు(పేద) రాష్ట్రంగా మార్చిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ తుప్పు పట్టిన ఇనుము లాంటిదని.. వర్షంలో పెడితే పూర్తి నాశనమైపోతుందని ఎద్దేవా చేశారు.

Modi On Congress
Modi On Congress
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 1:26 PM IST

Updated : Sep 25, 2023, 2:18 PM IST

Modi On Congress : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్‌లో చాలా కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని బిమారు రాజ్యంగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. సమర్థులైన యువత, వనరులు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్ చాలా రంగాల్లో వెనకబాటుకు గురిచేసిందని దుయ్యబట్టారు. భోపాల్‌లోని జంబోరీ మైదానంలో సోమవారం 'కార్యకర్తల మహాకుంభ్'లో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi Bhopal Visit : మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుందని మోదీ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న యువత తమ జీవితంలో బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రమే చూశారన్నారు. ప్రస్తుత యువత కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలన చూడకపోవడమే అదృష్టమని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో మధ్యప్రదేశ్‌ను కొత్త శక్తితో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యత్నించిందని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ తుప్పు పట్టిన ఇనుము లాంటిదని.. వర్షంలో పెడితే పూర్తి నాశనమైపోతుందని ఎద్దేవా చేశారు.

  • VIDEO | "The BJP made poor, women, exploited and deprived, SC, ST and OBC the biggest beneficiaries of development. The guarantee of preference given to the deprived by Modi has been fulfilled by taking one step after another," says PM Modi at 'Karyakarta Mahakumbh' in Bhopal. pic.twitter.com/UOvYYuQKUW

    — Press Trust of India (@PTI_News) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ సమర్థ యువత కలిగిన, వనరులు కలిగిన మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్ బిమారు (చాలా రంగాల్లో వెనకబాటు) అయ్యేలా చేసింది. కానీ బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో మధ్యప్రదేశ్‌ను కొత్త శక్తితో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యత్నించింది. కాంగ్రెస్ అంటేనే చెడు పాలన. కోట్లాది రూపాయల అవినీతితో అనేక రాష్ట్రాలను నాశనం చేసింది. దేశంలో కొన్నేళ్లపాటు అవినీతి, పేదరికం, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించింది"

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

తమ పార్టీ ప్రయోజనాల కోసం దేశ ప్రజలను పేదలుగానే కాంగ్రెస్ ఉంచేసిందని మోదీ ఆరోపించారు. తమ ఐదేళ్ల పాలను 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్లు చెప్పారు. డిజిటల్​ చెల్లింపులను కాంగ్రెస్​ వ్యతిరేకించిందన్న మోదీ.. యూపీఐ మోడ్​కు ప్రపంచం ఆకర్షితులైందని చెప్పారు. మహిళా రిజర్వేషన్​ బిల్లును కాంగ్రెస్​ పార్టీ సహా విపక్షాలు బలవంతంగా మద్దతు ఇచ్చాయని తెలిపారు. బిల్లును వారు అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారని.. ఎందుకంటే మహిళలు ప్రస్తుతం పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లు చెప్పారు.

కాంగ్రెస్​ నాయకులకు పేద ప్రజల జీవితం.. పిక్నిక్​ లాంటిదని మోదీ ఎద్దేవా చేశారు. పేదవాడి వ్యవసాయ క్షేత్రం.. ఆ పార్టీ నేతలకు ఫొటో షూట్ కోసం వాడే ప్రదేశమంటూ రాహుల్​పై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేశం వివిధ రంగాల్లో విజయం సాధించడం కాంగ్రెస్​ నేతలకు ఇష్టం లేదని ఆరోపించారు. భారత్​ను తిరిగి 20వ శతాబ్దానికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్​ చూస్తోందని అన్నారు.

'నిరాశతో 'చేతబడి'ని ఆశ్రయిస్తోంది'.. కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు!

పేదలను మోసం చేయడమే కాంగ్రెస్​ పని.. 50ఏళ్లుగా అదే అబద్ధం : మోదీ

Last Updated : Sep 25, 2023, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.