ETV Bharat / bharat

ప్రధాని తల్లికి అస్వస్థత.. హుటాహుటిన దిల్లీ నుంచి అహ్మదాబాద్​కు మోదీ

Modi mother health : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్​లోని యూఎన్​ మెహతా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే మోదీ దిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లారు.

modi mother health
తల్లితో మోదీ
author img

By

Published : Dec 28, 2022, 1:21 PM IST

Updated : Dec 28, 2022, 4:21 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్​లోని యూఎన్​ మెహతా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని యూఎన్​ మెహతా ఆస్పత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.
తల్లికి అనారోగ్యం దృష్ట్యా ప్రధాని బుధవారం మధ్యాహ్నం దిల్లీ నుంచి అహ్మదాబాద్​ వెళ్లారు. యూఎన్​ మెహతా ఆస్పత్రికి వెళ్లి.. తల్లిని పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న చికిత్స వివరాల్ని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మోదీ ఆకస్మిక పర్యటనతో.. గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
మోదీ తల్లికి అనారోగ్యం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డల మధ్య ప్రేమ అనంతమైనదని ట్వీట్​లో పేర్కొన్నారు రాహుల్.

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్​ మోదీ.. ఈ ఏడాది జూన్​లో వందో వడిలోకి అడుగుపెట్టారు. 1923 జూన్‌ 18న ఆమె జన్మించారు. హీరాబెన్ పుట్టినరోజున.. ప్రధాని మోదీ గాంధీనగర్‌లోని తన తమ్ముడు పంకజ్‌ మోదీ నివాసానికి వెళ్లి తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్​ చేశారు మోదీ. దాదాపు అరగంట పాటు మోదీ తన తల్లితో ముచ్చటించి అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్​ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు.

మరోవైపు మంగళవారమే నరేంద్ర మోదీ సోదరుడి బెంజ్​ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్​లో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం​ మోదీ తమ్ముుడు ప్రహ్లాద్​ దామోదర్​ దాస్​తో పాటు ఐదుగురు కుటుంబసభ్యులు.. బెంజ్​ కారులో బయలుదేరారు. మైసూరు నుంచి బందీపుర్​ వైపు వెళ్తుండగా కడకోల సమీపంలో రోడ్డు డివైడర్​ను కారు ఢీకొట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ కుటుంబసభ్యులను మైసూర్​లోని జేఎస్​ఎస్​ ఆస్పతికి తరలించారు. ప్రహ్లాద్ ముఖానికి గాయమైనట్లు పోలీసులు చెప్పారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు, డ్రైవర్​ స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు. కారు ఎయిర్​బ్యాగ్స్ సకాలంలో తెరుచుకోవడం వల్లే అందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని సమాచారం.

ఇవీ చదవండి : విడాకులు మంజూరైన వెంటనే భర్తను కోర్టులోనే చితకబాదిన భార్య బంధువులు

'దేశ ప్రజలను విద్వేషాలతో విడగొడుతున్నారు'.. కాంగ్రెస్​ ఆవిర్భావ వేడుకల్లో ఖర్గే

Last Updated : Dec 28, 2022, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.