ETV Bharat / bharat

'బైడెన్​ మద్దతుతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం'

అమెరికా ప్రెసిడెంట్​ ఎలక్ట్​ జో బైడెన్​తో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకూల సమయం చూసి మాట్లాడతారని కేంద్రం తెలిపింది. బైడెన్​ మద్దతుతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

Modi, Biden will speak at 'mutually convenient time', ties have bipartisan support in US: MEA
'బైడెన్​ మద్దతుతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం'
author img

By

Published : Nov 13, 2020, 5:31 AM IST

Updated : Nov 13, 2020, 6:06 AM IST

అమెరికా ప్రెసిడెంట్​ ఎలక్ట్​.. జో బైడెన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుకూల సమయాల్లో మాట్లాడతారని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఫలితంగా అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక మద్దతు లభిస్తుందని పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ను.. బైడెన్​ ఓడించిన కొద్దిరోజులకే విదేశీ వ్యవహారాల అంశం తెరపైకి వచ్చింది. అత్యధిక ఎలక్టోరల్​ ఓట్లు సాధించిన బైడెన్​ను.. మోదీ ట్విట్టర్​ వేదికగా అభినందించారని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మేరకు బైడెన్​తో కలిసి ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధాని ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

భారత్​- యూఎస్​ సంబంధాలను బలోపేతం చేసేందుకు మాజీ ఉపాధ్యక్షుడిగా బైడెన్​ చేసిన కృషిని మోదీ కొనియాడారని చెప్పారు అనురాగ్​. ఇరు దేశాల మధ్య ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అమెరికా ద్వైపాక్షిక మద్దతు ఉంటుందన్నారు.

లద్దాఖ్​ ప్రతిష్టంభన- పరిష్కారం దిశగా..

తూర్పలద్దాఖ్​లో ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా భారత్​,చైనా ముందడుగేసినట్టు తెలిపింది విదేశాంగ శాఖ. ఈ మేరకు సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చల్లో భాగంగా.. ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణకు అంగీకరించాయని స్పష్టం చేసింది. మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు.. ఇరుదేశాలు నిర్దిష్ట ప్రతిపాదనలపై కృషి చేస్తున్నాయన్నారు అనురాగ్​.

ఇదీ చదవండి: 'భారత్​-ఆసియాన్​ కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం'

Last Updated : Nov 13, 2020, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.