ETV Bharat / bharat

దొంగపై మూకదాడి చేసి హత్య.. కుక్కను గొడ్డలితో నరికి మర్డర్​ - ఝార్ఖండ్ క్రైమ్ న్యూస్

దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిపై మూకదాడికి పాల్పడి.. హత్య చేశారు గ్రామస్థులు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మరోవైపు, కుక్కను గొడ్డలితో నరికి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణం రాజస్థాన్​లో వెలుగుచూసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 1, 2023, 7:08 PM IST

ఝార్ఖండ్​ గిరిడీ​లో దారుణం జరిగింది. మేకల దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని కొట్టి చంపారు గ్రామస్థులు. మృతుడిని వినోద్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు వినోద్.. శనివారం రాత్రి బిరాలాల్ అనే వ్యక్తి పశువుల శాలలోకి ప్రవేశించాడు. మేకలు, ఆవులను దొంగిలించేందుకు అతడు శాలలోకి వెళ్లాడు. దీంతో పశువులు, మేకలు అరిచాయి. వెంటనే వాటి యజమాని బిరాలాల్ నిద్రలేచాడు. వెంటనే వినోద్​పై బాణంతో దాడి చేశాడు. తీవ్రగాయాలతో వినోద్ పారిపోతుండగా.. గ్రామస్థులు వచ్చి అతడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వినోద్ మృతి చెందాడు.

కుక్కపై గొడ్డలితో దాడి..
కుక్కను గొడ్డలితో నరికాడు ఓ వ్యక్తి. ఈ దాడిలో శునకం మరణించింది. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్​ జైపుర్​లో జరిగింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కర్ధానీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కుక్కపై బన్సీ లాల్ కుమావత్ అనే వ్యక్తి దాడి చేసినట్లు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.