Mob attacks train: భాజపా నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. బంగాల్లో తాజాగా లోకల్ ట్రైన్‌పై రాళ్ల దాడి చేశారు నిరసనకారులు. రాళ్ల దాడిలో పలు బోగీలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. నాదియా జిల్లాలోని బెతువదాహరి రైల్వే స్టేషన్లో ఘటన జరిగింది. సుమారు 1000 మందికిపైగా ఆందోళన కారులు లోకల్ రైలుపై.. రాళ్ల దాడికి పాల్పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.
అసలేం జరిగిదంటే: పెద్ద సంఖ్యలో నిరసనకారులు రోడ్డు దిగ్భందించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు వెళ్లగా.. కొందరు నిరసనకారులు బెతువదాహరి రైల్వే స్టేషన్లోకి ప్రవేశించారు. అక్కడ ఫ్లాట్‌ఫాంపై ఉన్న లోకల్ రైలుపై రాళ్లు రువ్వారు. ఈ దాడి కారణంగా లాల్గోనా లైన్లో రైలు సేవలు నిలిచిపోయినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే సేవల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి ఉన్నామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: ఈడీ ముందుకు రాహుల్.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
పాత టైర్లతో డైనోసర్లు, డ్రాగన్లు.. 'పంక్చర్ మ్యాన్' క్రియేటివిటీ సూపర్ గురూ!