ETV Bharat / bharat

శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? తిరుమల కొండపై ఈ 5 తప్పులు చేయకండి!

Mistakes to Avoid in Tirumala Darshanam: తిరుమల ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తుంటారు. అయితే.. కొండ మీదకు వెళ్లిన భక్తులు తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. అవి ఏంటి? ఎలా నివారించాలి? అన్నది చూద్దాం.

Mistakes to Avoid in Tirumala Darshanam
Mistakes to Avoid in Tirumala Darshanam
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 3:51 PM IST

Mistakes to Avoid in Tirumala Darshanam: తిరుమల కొండపై కొలువైన వెంకటేశ్వర స్వామి తమ కష్టాలు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే.. ఎంతో శ్రమపడి ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్తుంటారు. మొక్కులున్నవారు కాలినడకన తిరుమలకి వెళ్తుంటారు. అయితే.. తెలిసీ తెలియక కొందరు తిరుమల కొండపై 5 తప్పులు చేస్తున్నారట. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వరాహ దర్శనం చేసుకోవాలి: తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ.. ఆ తిరుమలేశుడి దర్శనం చేసుకుంటారు. అయితే.. స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు వరాహ స్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలి. తిరుమలను ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రతీతి. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు వంద అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీవరాహమూర్తిని కోరగా అందుకు ఆయన అంగీకరించి, ఆపై ప్రథమ దర్శనం, పూజ, నైవేద్యం తనకే జరగాలని సూచించారు. ఇందుకు శ్రీనివాసుడు సమ్మతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల అర్చక స్వాములు మొదటిది తప్ప.. మిగిలిన రెండింటిని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆ మొదటిది పాటించాల్సింది తిరుమల వెళ్లే భక్తులే. అందుకే భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలి.

TTD Job Notification 2023 : తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మనెంట్​ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!

తిరుమలలో ప్రాపంచిక సుఖాలను కోరుకోకూడదు: తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్లే వారు.. దానిని విహార యాత్రగానో మరోరకంగా భావించి వెళ్లకూడదు. కొంతమంది సందర్శకులు షాపింగ్​, విందులు, వినోదం ఎంజాయ్​ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే వెళ్తారు. అంతే కాకుండా ప్రాపంచిక సుఖాల కోసం అసలు వెళ్లకూడదు. కొత్తగా పెళ్లైన వారు.. ఆరు నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదన్న నియమం మన పెద్దలు పెట్టడానికి కారణం కూడా ఇదే.

తిరుమల వెళ్లి దొంగ దర్శనాలు చేసుకోకూడదు: భక్తులందరికీ సాఫీగా ఆ స్వామి వారి దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల దేవస్థానం నిర్దిష్ట నియమాలను ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమల దేవస్థానానికి తరలివస్తుంటారు. అయితే కొద్ది మంది దొంగ దర్శనాలు చేసుకుంటారు. మోసాలు చేసి దర్శనాలు చేసుకుంటే ఆ ఫలితం కలుగదు.

TTD Alert : భక్తులకు అలర్ట్.. తిరుమల వెళ్తున్నారా? ఈ విషయం తెలియకుంటే ఇబ్బంది పడతారు!

మాఢవీధుల్లో చెప్పులు నిషిద్ధం: మాఢవీధుల్లో చెప్పులు ధరించి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగకూడదు. ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులు పరమ పవిత్రమైనవి. అలాగే అక్కడ చెప్పులు వేసుకుని తిరగరాదని బోర్డు కూడా ఉంటుంది. దానిని గమనించని వారు.. ఈ తప్పు చేస్తారు.

తిరుమలలో భక్తులకు పుష్పాలకు దూరంగా ఉండాలి: తిరుమలలో స్వామిని మాత్రమే పూలతో అలంకరించాలి. తిరుమలలో పూసిన ప్రతీ పువ్వు స్వామి వారి కైంకర్యాలకి మాత్రమే ఉపయోగపడాలి. స్వామికి ఉపయోగించిన నిర్మాల్యాలను కూడా ఎవరికీ ఇవ్వకుండా భూతీర్థంలో చూపించి అడవిలో వదిలిపెడుతుంటారు. తిరుమలలో పూసిన పుష్పాలను మహిళలు అలంకరించుకోకూడదని స్పష్టమైన నోటీసులు ఉన్నప్పటికీ, ఈ నిబంధన తరచుగా ఉల్లంఘిస్తున్నారు.

TTD Tirumala Seva Tickets for January 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్.. కొత్త ఏడాది జనవరి ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల తేదీలివే.!

TTD Tirumala Seva Tickets for November : తిరుమల శ్రీవారి సేవాటికెట్లు.. నేడే విడుదల!

IRCTC Hyderabad to Tirupati Tour : హైదరాబాద్ To తిరుపతి.. హ్యాపీగా శ్రీనివాసుడి దర్శనం.. టికెట్ ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.