ETV Bharat / bharat

'కాళీమాత'పై ఎంపీ కామెంట్స్​.. దీదీ కీలక వ్యాఖ్యలు.. 'తప్పు చేశారు కానీ..!'

author img

By

Published : Jul 7, 2022, 5:24 PM IST

Mahua Moitra Comment: కాళీమాతపై తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా దీని గురించి స్పందించారు. మనుషులు తప్పులు చేస్తారని.. కానీ వాటిని సరిదిద్దుకోవచ్చని ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మరోవైపు.. మొయిత్రాపై మధ్యప్రదేశ్​ భోపాల్​లో కేసు నమోదైంది.

'Mistakes can be rectified', says Mamata as Mahua Moitra faces FIR over 'Kali' remark

Mahua Moitra Comment: కాళీమాతను మాంసాహారిగా, మద్యం స్వీకరించే దేవతగా తాను నమ్ముతున్నానంటూ తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన ఆమెను అరెస్టు చేయాలని భాజపా డిమాండ్​ చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మనుషులు తప్పులు చేస్తారని.. వాటిని సరిదిద్దుకోవచ్చని మాట్లాడారు. కోల్​కతాలో విద్యార్థులకు క్రెడిట్​ కార్డుల పంపిణీ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

''మనుషులు తప్పులు చేస్తారు.. కానీ వాటిని సరిదిద్దుకోవచ్చు. మేం కూడా పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ఆ తర్వాత సరిదిద్దుకుంటాం. కొందరు మంచి పనిని సహించక అరుస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు మన మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో ఆలోచించండి.''

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

మహువాను టీఎంసీ నుంచి సస్పెండ్​ చేయాలని భాజపా నేతలు తృణమూల్​ కాంగ్రెస్​కు సూచించారు. దీంతో.. కాళీపై మొయిత్రా వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ఆమె బుధవారం అన్‌ఫాలో చేశారు. కానీ.. దీదీ ట్విట్టర్​ అకౌంట్​ను మాత్రం అనుసరిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలతో త్వరలోనే మొయిత్రా తృణమూల్‌ను వీడవచ్చని పలువురు విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలోనే దీదీ పైవ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు భాజపా విమర్శల నేపథ్యంలో ఆ పార్టీకి సవాల్​ విసిరారు మహువా. తాను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నిరూపించాలని ఛాలెంజ్​ చేశారు. గూండాలకు, వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను సత్యాలు మాట్లాడుతున్నా అని.. సత్యానికి ఎలాంటి బ్యాకప్​ శక్తులు అవసరం లేదని అన్నారు.
ఎంపీ మహువా వ్యాఖ్యలను.. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. కాళీమాతపై ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ దేవతలను అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ మహువాపై మధ్యప్రదేశ్​ భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

'కాళీ పోస్టర్​'పై స్పందించి..
దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజాచిత్రం 'కాళీ'కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదమైంది. కాళీ పాత్రధారి స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన జెండాను చేతబూని, సిగరెట్‌ కాల్చుతూ ఉన్న దృశ్యం ఆ పోస్టర్‌లో ఉంచారు. మంగళవారం ఓ చర్చా కార్యక్రమంలో దీనిపై మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి దారితీశాయి. తాను ఏ చిత్రానికీ, ఏ పోస్టర్‌కూ మద్దతు ఇవ్వలేదని, ధూమపానం అనే పదాన్ని అసలు వాడనేలేదని వివరణ ఇచ్చారు.

ఇవీ చూడండి: టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై? అరెస్ట్ చేయాలని భాజపా డిమాండ్​!

'కాళీ' దర్శకురాలి పోస్టుపై ట్విట్టర్‌ కొరడా.. కెనడా మ్యూజియం క్షమాపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.