ETV Bharat / bharat

'మైనర్లు సహజీవనం చేయడం అనైతికం, చట్టవిరుద్ధం- నేర విచారణ నుంచి రక్షణ ఉండదు'

Minors live in relationship Allahabad high court : మైనర్లు సహజీవనం చేయడం చట్టవిరుద్ధమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. మేజరైన అమ్మాయితో సహజీవనం చేస్తినా.. మైనర్ అబ్బాయిలు నేరం నుంచి రక్షణ పొందలేరని ధర్మాసనం స్పష్టం చేసింది.

live in relationship Allahabad high court

author img

By

Published : Aug 2, 2023, 7:18 PM IST

Updated : Aug 2, 2023, 7:25 PM IST

Minors live in relationship Allahabad high court : 18ఏళ్లలోపువారు సహజీవనం చేయడం చట్టవిరుద్ధం, అనైతికమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. 18ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. వయసులో తనకంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కావని జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ బిర్లా, జస్టిస్‌ రాజేంద్రకుమార్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కొన్నిరోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 19ఏళ్ల అమ్మాయి, 17ఏళ్ల అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేయడం ప్రారంభించారు. తమ అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన తర్వాత అమ్మాయి కుటుంబసభ్యులు అమెను బలవంతంగా తమ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. అబ్బాయి తరపున అతని తండ్రి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అబ్బాయిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు... 18ఏళ్లలోపువారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉన్నప్పటికీ... వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది.

'శృంగార సమ్మతి వయసు తగ్గించాలి'
కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్.. కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల కీలక సూచన చేసింది. శృంగార సమ్మతి వయసును బాలికలకు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని పేర్కొంది. 14 ఏళ్లకే బాల బాలికలు యవ్వన దశకు చేరుకుంటున్నారని, దీంతో శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారని తెలిపింది. ఇందులో ఇద్దరి తప్పిదం ఉన్నప్పటికీ బాలురు నేరారోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని గుర్తు చేసింది. ఐపీసీకి సవరణ చేయకముందు శృంగార సమ్మతి వయసు 16 ఏళ్లుగానే ఉండేదని ధర్మాసనం గుర్తు చేసింది. దీన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని అభిప్రాయపడింది. 2020లో ఓ బాలికను పదేపదే మానభంగం చేసి, గర్భవతిని చేశాడంటూ ఓ యువకుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్​ను జూన్ 27న కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Last Updated : Aug 2, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.