ETV Bharat / bharat

మైనర్​పై రెండేళ్లుగా అత్యాచారం.. తీవ్రంగా హింసించి గ్యాంగ్​రేప్ - gang rape on minor

Minor girl gang rape: రాజస్థాన్​లో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్లుగా ఓ వ్యక్తి తనపై రేప్ చేస్తున్నాడని బాలిక తెలిపింది. తొలుత రేప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు.. తాజాగా మరికొందరితో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు.

gang rape on minor
gang rape on minor
author img

By

Published : Apr 12, 2022, 8:04 AM IST

Minor girl gang rape: రాజస్థాన్ చురులో దారుణం జరిగింది. తనతో స్నేహానికి ఒప్పుకోలేదని ఓ మైనర్​పై తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు యువకుడు. రతన్​నగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసుకుంది. పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్​లో ఇద్దరి పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. బాధితురాలిని తీవ్రంగా హింసించారు. ముఖం, శరీర భాగాలపై గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

Rajasthan Minor rape: బాధితురాలు పదో తరగతి చదువుతోంది. తనతో స్నేహం చేయాలని తమ ఇంటిదగ్గర ఉండే కిషోర్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం అడిగాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. అందుకు నిరాకరించినా.. నిందితుడు ఏదో విధంగా తరచూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. 'ఏడాదిన్నర క్రితం అతడు రాత్రి సమయంలో కలవాలని కోరాడు. పొలం దగ్గరకు రావాలని పిలిచాడు. అక్కడ నాపై అత్యాచారం చేశాడు. వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ప్రతిరోజూ అత్యాచారం చేసేవాడు. నిందితుడికి భయపడి ఇంట్లో ఎవరికీ ఈ విషయం గురించి చెప్పలేదు' అని బాధితురాలు తెలిపింది.

ఇలాగే.. రెండురోజుల క్రితం యువకుడు బాలికను పొలానికి రమ్మని పిలిచాడని పోలీసులు వెల్లడించారు. తనతో పాటు మరికొందరినీ తీసుకొచ్చాడని చెప్పారు. 'వారిలో ఒకరితో రిలేషన్​షిప్​ పెట్టుకోవాలని బాలికపై ప్రధాన నిందితుడు కిషోర్ బలవంతం చేశాడు. అయితే, బాలిక అందుకు తిరస్కరించింది. దీంతో నిందితులు కోపంతో మైనర్​పై దాడి చేశారు. అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక స్పృహ కోల్పోయింది. నిందితులు ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. తర్వాత స్పృహలోకి వచ్చిన బాలిక.. ఇంటికి వెళ్లి మొత్తం విషయాన్ని చెప్పేసింది' అని పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'బదిలీ కావాలంటే భార్యను పంపించు'.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.