ETV Bharat / bharat

ఇంజినీర్ 'హైటెక్'​ సూసైడ్​.. పాలిథీన్​ బ్యాగ్​లో నైట్రోజన్​ గ్యాస్​ నింపి.. తలకు...

Sub Engineer Suicide: పాలిథీన్​ బ్యాగ్​లో నైట్రోజన్​ గ్యాస్​ నింపుకొని.. తలకు చుట్టుకొని చనిపోయాడు ఓ సబ్​ ఇంజినీర్​. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని నర్మదాపురంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Mentally Disturbed Sub Engineer Gave His Life In a Mechanical Way

author img

By

Published : Jul 5, 2022, 5:17 PM IST

Sub Engineer Suicide: అనారోగ్యంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించిన ఓ సబ్​ ఇంజినీర్​ ప్రాణం తీసుకున్నాడు. తలకు పాలిథీన్​ బ్యాగ్​ చుట్టుకొని.. అందులో నింపిన నైట్రోజన్​ గ్యాస్​ను పీల్చుకొని ఊపిరాడక చనిపోయాడు. చనిపోయే ముందు సూసైడ్​ నోట్​ కూడా రాశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ నర్మదాపురంలో జరిగింది. మృతుడిని మునిసిపాలిటీలో పనిచేసే సబ్​ ఇంజినీర్​ చేతన్​ భూమర్కర్​గా గుర్తించారు.

మీనాక్షి చౌక్​లోని గిన్నీ కాంపౌండ్​లో పనిచేసే చేతన్​ భూమర్కర్​కు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు. దీంతో తీవ్రంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చేతన్​ ఎంతసేపటికీ తన గది తలుపులు తెరవకపోయేసరికి.. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వారు తలుపులు పగులకొట్టి చూడగా చేతన్​ విగతజీవిగా పడి ఉన్నాడు.

గదిలో నైట్రోజన్​ గ్యాస్​ సిలిండర్​, పాలిథీన్​ బ్యాగ్​ లభ్యమయ్యాయి. సూసైడ్​ నోట్​లో.. తన చావుకు ఎవరూ కారణం కాదని, అనారోగ్యంతోనే చనిపోతున్నానని పేర్కొన్నాడు మృతుడు. తన కుటుంబసభ్యులకు సమాచారం అందించాలని లేఖలో కోరాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: వెంటిలేటర్​లో ఇరుక్కున్న పిల్లి.. గంటలపాటు ఉక్కిరిబిక్కిరి!

రాహుల్​ గాంధీపై ఆ వీడియోలు.. టీవీ యాంకర్​ అరెస్టుపై రెండు రాష్ట్రాల వార్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.